బ్యాడ్ టైమ్‌లో బాలీవుడ్ మూవీ.. రాజ్ తరుణ్ లక్కు బావుంది!

గత కొంత కాలంగా వరుస అపజయలతో సతమతమవుతున్న హీరోల్లో రాజ్ తరుణ్ ఒకడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ యంగ్ హీరోకి అస్సలు హిట్టు పడటం లేదు. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో కాస్త హడావుడి చేసిన ఈ కథానాయకుడు ఇప్పుడు మాత్రం మంచి అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల కావాల్సిన సినిమా కూడా వాయిదా పడింది.

విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా లాక్ డౌన్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా OTTలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ అవన్నీ పుకార్లే అని హీరో కొట్టి పారేశాడు. అదే విధంగా చేతికొచ్చిన మరొక మంచి ఆఫర్ కూడా క్యాన్సిల్ అయినట్లు టాక్ రాగా ఆ రూమర్స్ పై కూడా రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చాడు.

 Raj tarun about his upcoming bollywood remake dream girl

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ నటించిన డ్రీమ్ గర్ల్ రీమేక్ సినిమాలో రాజ్ తరుణ్ నటించనునట్లు ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిర్మాత సురేష్ బాబు కరోనా లాక్ డౌన్ లో ఆర్థిక ఇబ్బందుల వలన ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు టాక్ వచ్చింది. దీంతో రాజ్ తరుణ్ వెంటనే ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ.. ఆ రీమేక్ ఆగిపోలేదని లాక్ డౌన్ అనంతరం త్వరలో సెట్స్ పైకి రానుందని అన్నారు. నిజంగా బ్యాడ్ టైమ్ ఈ హీరోకి పరిస్థితులు బాగానే కలిసొస్తున్నాయి. మరి ఆ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X