Anubhavinchu Raja Trailer: రాజ్ తరుణ్ ఊర మాస్ ఎంటర్టైన్మెంట్.. టైటిల్ కు తగ్గట్లుగానే..

ఉయ్యాలా జంపాలా సినిమాతో వెండితెరకు పరిచయమైన యువ హీరో రామ్ చరణ్ కెరీర్ మొదట్లో వరుస విజయాలను అందుకున్నాడు. మళ్లీ వరుస పరాజయాల అనంతరం కొంత మార్కెట్ కూడా తగ్గుతూ వచ్చింది. అయితే అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా అతనికి కొన్ని ప్రొడక్షన్ హౌస్ ల నుంచి అయితే మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే రాజ్ తరుణ్ ఎక్కువగా రొటీన్ కమర్షియల్ సినిమాలను ట్రై చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. మధ్యలో త్రిల్లర్ టైప్ లో కొన్ని సినిమాలు కూడా చేశాడు. కానీ అవి పెద్దగా వర్కవుట్ కాలేదు.

ఇక ఈ సారి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా అనుభవించు రాజా అనే ఒక విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను స్టార్ హీరో అక్కినేని నాగార్జున విడుదల చేశారు. జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి.. కానీ.ఎల్లప్పుడూ జీవితంలో ఆనందంగా ఉండాలి అంటూ ప్రత్యేకమైన పోస్ట్ చేస్తూ నాగార్జున ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక రాజ్ తరుణ్ మరోసారి తనదైన శైలిలో మంచి ఎంటర్టైన్మెంట్ రోల్ చేసినట్లు అర్థమవుతోంది.

'ఇక రూపాయి పాపాయి లాంటిది.. దాన్ని పెంచి పెద్దది చేసుకోవాలి కానీ ఎవరి చేతిలో పడితే వాడి చేతిలో పెట్టకూడదు' అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ లో రాజ్ తరుణ్ ఊర మాస్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. జులాయిగా తిరిగే ఒక కుర్రాడి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జీవితాన్ని ఎంత సంతోషంగా ఉన్నాడు అనేది సినిమాలో ప్రధాన అంశం అని తెలుస్తోంది. సెక్యూరిటీగా చేయడం అందులోనే ప్రేమను వెతుక్కోవడం అనంతరం తన గ్రామంలోనే అనుభవించు రాజా అంటూ విలాసవంతమైన జీవితానికి గడుపుతున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో అనేక రకాల కోణాల్ని ఆహ్లాదకరంగా చూపించినట్లు అనిపిస్తోంది.

ఇక మొత్తానికి సినిమా అనుభవించు రాజా అనే టైటిల్ కు తగ్గట్లుగానే ఉన్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. రాజ్ తరుణ్ పాత్ర కూడా చాలా భిన్నంగా ఉంది. అయితే కంటెంట్ జనాలకు ఇంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. ఇక ఈ సినిమాను అన్నపూర్ణ ప్రొడక్షన్ అలాగే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. ఇక రాజ్ తరుణ్ కు జోడీగా కాశిష్ ఖాన్ నటించగా పోసాని కృష్ణ మురళి అజయ్ రవి కృష్ణ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.

Raj tarun Anubhavinchu Raja movie telugu trailer

సినిమా ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక సినిమాను నవంబర్ 22 విడుదల చేయాలని అనుకుంటున్నారు ఎక్కువగా పోటీ లేని సమయంలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి రాజ్ తరుణ్ ఈ సినిమాతో అయినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X