twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anubhavinchu Raja twitter review: మరోసారి అలాంటి టాక్ ను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్!

    |

    టాలెంటెడ్ యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన అనుభవించు రాజా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న బ్యూటీ కశిష్ ఖాన్. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా పై మొదటి నుంచి కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ప్రమోషన్ డోస్ కూడా గట్టిగానే పెంచారు. రాజ్ తరుణ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరు కూడా ఎక్కువగా యువతను ఆకట్టుకునే విధంగా కాలేజ్ లలో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాను చూసిన కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో వారి రివ్యూని కూడా ఇస్తున్నారు.

    హీరోల పేర్లతో ప్రమోషన్స్

    హీరోల పేర్లతో ప్రమోషన్స్

    అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఒక డిఫరెంట్ కామెడీ పాత్రలో నటించగా నార్త్ బ్యూటీ కశిష్ ఖాన్ పక్కింటి అమ్మాయి అనే తరహాలో నటించింది. సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్ చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఎక్కువగా ఇతర హీరోల గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడుతూ వారి అభిమానులను కూడా ఆకట్టుకుంటున్నారు.

    RRR పాటతో వైరల్

    RRR పాటతో వైరల్

    ఇక రీసెంట్ గా ఒక బస్సుల్లో వెళ్లిన అనుభవించు రాజా టీమ్ అందరూ కూడా నాటు నాటు సాంగ్ పాటకు నాటుగానే డ్యాన్స్ చేశారు. చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల అభిమానులందరిని కూడా కవర్ చేశారని అనిపిస్తోంది. ఇక దర్శకుడు శ్రీను కూడా మెగాస్టార్ నుంచి రామ్ చరణ్ వరకు అందరి నుంచి కూడా మద్దతు అందుకున్నట్లు తెలుస్తోంది.

    పాజిటివ్ రెస్పాన్స్

    పాజిటివ్ రెస్పాన్స్

    అనుభవించు రాజా సినిమా రాజ్ తరుణ్ కు మంచి విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా సినిమాను చూసిన వారు కొందరు పాజిటివ్ గా స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. పలు ఏరియాల్లో ప్రదర్శింపబడిన షోలను చూసిన కొందరు ప్రేక్షకులు నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.

    నిరాశపరిచే మూవీ అంటూ

    నిరాశపరిచే మూవీ అంటూ

    ఇక మరికొందరు మాత్రం సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు అని భిన్నంగా స్పందిస్తున్నారు. రాజ్ తరుణ్ నుంచి మరొక నిరాశపరిచే మూవీ అంటూ.. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఉహించినంత మంచి సినిమా రాలేదని అంటున్నారు. అలాగే సినిమా యవారేజ్ కు తగ్గువగా ఉందని అంటున్నారు. ఇక రాజ్ తరుణ్ మరో సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కూడా మరికొందరు కోరుకుంటున్నారు.

    Recommended Video

    Radhe Shyam #EeRaathale Trending 1 | Prabhas పవర్ ఫుల్ లైనప్ || Filmibeat Telugu
    రాజ్ తరుణ్ నమ్మకం

    రాజ్ తరుణ్ నమ్మకం

    యువ హీరో రాజ్ తరుణ్ మొదట్లో వరుసగా బాక్సాఫీసు హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మాత్రం అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. ఇక అనుభవించు రాజా సినిమాతో అయితే తప్పకుండా సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాడు. మరి పూర్తి స్థాయిలో ఈ సినిమా జనాలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    English summary
    Raj tarun anubhavinchu raja twitter review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X