Lavanya : నన్ను చంపేస్తారేమో.. భయంతో బతుకుతున్నా.. రాజ్ తరుణ్ లవర్ క్షమాపణలు!
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రోజురోజుకు సంచలన విషయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ నుంచి తను విడిపోవాడనికి కారణం మస్తాన్ సాయి అంటూ ఆ మధ్యలో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లావణ్య ఫిర్యాదు మేరకు అధికారులు అతన్ని అరెస్ట్ చేసి, కస్టడీ లో ఉంచి విచారణ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటితో కస్టడీ సమయం కూడా ముగిసింది. దీంతో ఈ కేసులోని సంచలన విషయాలను ఎలా నిర్ధారించారనేది చూడాలి. ఈ లోగా లావణ్య మాత్రం సమయం ఉన్నప్పుడల్లా మీడియాతో తన సమస్యలను తెలుపుతూనే వస్తోంది.
ఈ క్రమంలో లావణ్యకు ప్రాణహాణి ఉందనే విషయాన్ని వెల్లడించింది. తాజాగా మీడియాతో మాట్లాడిన లావణ్య... తనను బతకిస్తారో లేదోనని.. ఈ లోగా ఒక్కసారైనా రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని ఉందని తెలిపింది. అలాగే తన తల్లిదండ్రులను కూడా బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నానంటూ కంటతడి పెట్టుకుంది. తను చేసిన తప్పుకు అన్యంపుణ్యం తెలియని వాళ్లు ఎంతో కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన వల్ల వాళ్లు ఇబ్బంది పడటం లావణ్యకు గుండెనిండా బాధను నింపిందని చెప్పింది.

లావణ్య మాట్లాడుతూ... 'నన్ను ఈలోగా బతకనిస్తారో లేదో తెలియదు. ఒక్క అవకాశం ఉంటే మాత్రం.. రాజ్ చిన్నోడా.. సారీ రా.. నువ్వు నా ముందు ఉంటే నీకాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని ఉంది. మా తల్లిదండ్రులనూ క్షమాపణలు కోరుతున్నాను. పడకూడదని మాటలన్నీ పడ్డారు. నిందలు మోశారు. నేను చేసిన తప్పుకు మీరంతా ఇబ్బంది పడుతున్నారు. నేను డబ్బు కోసమో, ఎటువంటి చెడు ఉద్దేశంతో ఇలాంటి పనులు చేయలేదు. నాలాంటి దుస్థితి, నాకు జరిగిన అన్యాయం ఇంకో ఆడపిల్లకు జరగకూడదనే బయటికి వచ్చి ఇంతలా ఫైట్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో ఏ ఒక్క అమ్మాయి కూడా నాలాగా అవ్వకూడదని ఈ స్టాండ్ తీసుకున్నాను.' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక లావణ్యకు జరిగిన అన్యాయంపై కొద్దిరోజులుగా ఫైట్ చేస్తూనే ఉంది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తర్వాత లావణ్యకూ రాజ్ తరుణ్ కు బ్రేకప్ అయ్యింది. లావణ్య డ్రగ్స్ తీసుకుంటుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అందుకు కారణం మస్తాన్ సాయి అనే వ్యక్తేనని, తన వల్ల చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయని ఫిర్యాదు చేసిన సమయంలో చెప్పిన విషయం తెలిసిందే.
మస్తాన్ ను లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపారు. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి హైదరాబాద్ లో పార్టీలు నిర్వహిస్తూ అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసేవాడని, ఆ తర్వాత లోబరుచుకుని వీడియోలు కూడా షూట్ చేస్తుంటాడని లావణ్య ఫిర్యాదు లో పేర్కొంది. మస్తాన్ హార్డ్ డిస్క్ లో 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నాయని ఆరోపించింది. వాటితో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగేవాడని పేర్కొంది. ఏదేమైనా పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రస్తుతం నిజనిర్ధారణ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











