సహజీవనం తర్వాత ఇంకా తప్పేముంది? రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్!

గత కొన్ని రోజులు నుంచి తెలుగు సినిమా దగ్గర గట్టిగా కాంట్రవర్సీగా మారిన యువ హీరో రాజ్ తరుణ్ కోసం అందరికీ తెలిసిందే. కాగా ఒకపక్క తన రాబోవు చిత్రం "తిరగబడరా సామి" ప్రమోషన్స్ లో ఉంటే దీనికి మించిన అటెన్షన్ ని తన ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో అందరిలో అందుకున్నాడు. దీనితో పనిలో పని తన సినిమాకి కూడా ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అయితే గత కొన్నాళ్ల నుంచి తన మాజీ ప్రేయసి లావణ్య అతడి విషయంలో పోరాటమే చేస్తుంది.

దీనితో రాజ్ తరుణ్ కూడా తన వెర్షన్ తో లావణ్య తనని ఇబ్బంది పెడుతుంది అని తాను కూడా న్యాయస్థానం లోనే తేల్చుకుంటా అంటూ తానూ సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఇపుడు ఈ ఇద్దరి కేసుల్లో అనేక మలుపులు రోజు రోజుకి తిరుగుతుండగా కొత్త కొత్త పాత్రలు కూడా పరిచయం అవుతున్నాయి. అలా ఈ ఇద్దరి మధ్యలో ముందు యంగ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు వచ్చింది.

raj tarun friend leaves a legal and logical questions on lavanya case

దీనితో తమ ప్రేమలో మెయిన్ విలన్ ఆమెనే అంటూ లావణ్య ఆమె పేరుని కూడా రాజ్ తరుణ్ తో కలిపి రాసి కేసు ఫైల్ చేసింది. కాగా ఈ తర్వాత మరో ట్విస్ట్ ఇస్తూ మాల్వి తమ్ముడు పేరు కూడా చేర్చి షాకిచ్చింది. దీనితో మాల్వి ఊరుకోలేదు. నా వరకు వస్తేనే ఊరుకోలేదు నా ఫ్యామిలీ జోలికి వస్తే లావణ్యపై పరువు నష్టం దావా వేస్తాను అనేవరకు వెళ్ళింది.

కాగా ఈ తర్వాత రాజ్ తరుణ్ తనకి 5 కోట్లు ఆఫర్ చేసాడని అతన్ని వదిలేసి కేసు వాపసు తీసుకొని సారి చెప్పాలని బెదిరించారు అని లావణ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ గగ్గోలు పెట్టింది. అయితే ఇవన్నీ ఇలా జరుగుతుంటే తాజాగా రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ బాషా అనే ఒకతను వెలుగులోకి వచ్చాడు. కాగా తాను రాజ్ తరుణ్ కి ఎప్పటి నుంచో స్నేహితుడిని అని నా ఫ్రెండ్ కోసం మాట్లాడ్డానికి అతని అనుమతి తోనే బయటకి వచ్చానని చెప్పాడు.

raj tarun friend leaves a legal and logical questions on lavanya case

అయితే తాను రావడమే మాట్లాడుతూ లావణ్యపై క్రేజీ లాజిక్ వదిలాడు అని చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి మన భార్య అయినప్పటికీ ఆమె అనుమతి లేకుండా ఒంటి మీద చెయ్యి వేస్తే ఆమెకి అతని భర్త పై కూడా కేసు వేసే హక్కు ఉంది కదా మరి అలాంటప్పుడు ఒకబ్బాయి ఒక అమ్మాయిని కొన్నాళ్ళు కలిసి ఉన్నప్పటికీ తర్వాత మనసు మార్చుకొని వద్దు అనుకోవడంలో తప్పేముంది అని ప్రశ్నించాడు.

ఇష్టం లేకుండా ఒకమ్మాయి మీద చెయ్యి వేస్తేనే ఒప్పుకోరు అలాంటిది ఒక అబ్బాయి తనకి వద్దు అనుకుంటే ఇంకా ఎందుకు పట్టుకొని ఉండాలి అని అది అతడికి ఇబ్బంది కాదా? అని సాలిడ్ లాజిక్ ని ఆమె విషయంలో వదిలాడు. ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన అంశమే అని చెప్పాలి. దీనితో రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా వచ్చిన తన ఫ్రెండ్ మాత్రం చాలా సపోర్టివ్ గా ఉన్నాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ లాజిక్ పై లావణ్య సైడ్ నుంచి ఏమన్నా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X