రాజ్ తరుణ్‌తో సహజీవనం..లైవ్‌లో హీరోయిన్ బండారం బయటపెట్టిన ప్రేయసి లావణ్య!
యువనటుడు రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం తెలుగు చిత్ర సీమను కుదిపేస్తోంది. తనతో 11 ఏళ్ల పాటు సహజీవనం చేసి మరో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడంటూ హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. అయితే అనూహ్యంగా తనకే పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆమె షాకైంది. ఫిర్యాదులో ఆరోపించిన అంశాలపై తగిన ఆధారాలు కావాలని లావణ్యకు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది.
రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్న సినీనటి మాల్వీ మల్హోత్రా , ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని.. రాజ్ తరుణ్ లైఫ్‌లోంచి వెళ్లకపోతే చంపుతామని వార్నింగ్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తారు మాల్వీ ఆమె సోదరుడు బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది. హిమాచల్ ప్రదేశ్ సీఎం తన తండ్రికి క్లోజ్ ఫ్రెండ్ అనీ.. తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని నన్ను వారిద్దరూ బెదిరించారని లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటున్నాడని.. ఆయన లేకపోతే తాను ఉండలేనని తేల్చిచెప్పింది.

అటు రాజ్ తరుణ్ సైతం లావణ్య తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. 2017 వరకు మాత్రమే శారీరకంగా, మానసికంగా రిలేషన్‌లో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. కానీ తర్వాత తను డ్రగ్ అడిక్ట్ అయ్యిందని, చెడు స్నేహాలు చేస్తోందని దీంతో ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయమన్నానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్‌ను దక్కించుకోవడానికే ఈ కేసు పెట్టి.. తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని రాజ్ తరుణ్ ఆగ్రహ వ్యక్తం చేశారు.
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తనకు క్లోజ్ ఫ్రెండ్ అని.. తనతో కలిసి నటించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అయినా ముంబైలో ఉండే ఆమెకు, హైదరాబాద్‌లో ఉండే తనకు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఎలా సాధ్యమవుతుందని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. నేను లేనిదే బతకనని చెబుతున్న ఆమె మస్తాన్ అనే వ్యక్తితో ఎందుకు డేటింగ్ చేస్తోందని ఆయన నిలదీశారు.
మరోవైపు తనపై లావణ్య చేస్తున్న ఆరోపణలపై మాల్వీ మల్హోత్రా సైతం స్పందించారు. రాజ్ తరుణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. గడిచిన 6 నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడింది కూడా లేదన్నారు. రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ప్రతి హీరోయిన్‌ను లావణ్య వేధిస్తోందని.. అలాగే తనకు కూడా మెసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వీ ఆరోపించారు. తన కుటుంబం నుంచి ఎవరూ లావణ్యను బెదిరించడం లేదని.. ఆమె తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని మాల్వీ మల్హోత్రా పేర్కొన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న లావణ్యపై తానే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ వార్తాసంస్థ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో పాల్గొన్న లావణ్య .. రాజ్‌తరుణ్- మాల్వీల ఎఫైర్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. మాల్వీతో తాను ఫోన్‌లో మాట్లాడినప్పటి ఆడియో క్లిప్‌ను లైవ్‌లో మీడియాకు వినిపించింది. ఇందులో మాల్వీని లావణ్య గట్టిగా నిలదీసినట్లుగా ఉంది. అలాగే పాండిచ్చేరి, కోయంబత్తూరు ప్రాంతాలకు ఎందుకు వచ్చినట్లు అని లావణ్య ఆమెను ప్రశ్నించింది. దీనికి తాను షూటింగ్ నిమిత్తం సౌత్‌లోని కొన్ని ఏరియాలకు వచ్చినట్లుగా మాల్వీ బదులిచ్చారు.
ఇదే సమయంలో మే 11న చెన్నైలో రాజ్ తరుణ్ బర్త్ డే సెలబ్రేషన్‌లోనూ మాల్వీ పాల్గొన్నారని.. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా లావణ్య మీడియాకు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడబోతే రాజ్‌తరుణ్ - లావణ్య-మాల్వీల ఎపిసోడ్ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











