ఇద్దరి లోకం ఒకటే.. సెన్సార్ పూర్తి.. ఈసారైనా హిట్ కొట్టేనా?
ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్.. ఆపై వరుస విజయాలతో ఓ రేంజ్‌లో దూసుకుపోయాడు. కుమారి 21ఎఫ్ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. ఆపై మరో హిట్ కొట్టలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కెరీర్‌ను గాడిలో పెట్టుకోలేకపోయాడు. తాజాగా ఇద్దరిలోకం ఒకటే అంటూ పలకరించేందుకు సిద్దమయ్యాడు.
రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్ ఎంటర్‌టైనర్ ఇద్దరి లోకం ఒకటే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. జీఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా రాజ్ తరుణ్ హిట్ కొడతాడా? లేదా ? అన్నది చూడాలి.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ తమ బ్యానర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రమిదని పేర్కొన్నారు. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను డైరెక్టర్ కృష్ణ తెరకెక్కించారని తెలిపారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చిందన్నారు. త్వరలోనే మిగిలిన పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. సినిమా సెన్సార్ పూర్తయ్యిందని, ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











