ఫీల్ గుడ్‌లా అనిపించే ఇద్దరి లోకం ఒకటే.. ఆసక్తికరంగా ట్రైలర్

ఉయ్యాల జంపాల సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన హీరో రాజ్ తరుణ్. అటుపై సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి సూపర్ హిట్స్‌తో దూసుకుపోయాడు. అయితే గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక వెనుకబడ్డాడు. దాదాపు కెరీర్ క్లోజ్ అనుకునే టైమ్‌లో ఇద్దరి లోకం ఒకటే అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.

టైటిల్, పోస్టర్స్, పాటలతో హైప్ క్రియేట్ చేసిన ఇద్దరి లోకం ఒకటే చిత్రం.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. అర్జున్ రెడ్డి తరువాత మళ్లీ అంతటి స్కోప్ ఉన్న పాత్రను చేస్తోన్న షాలినీ పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కాసేపటి క్రితమే విడుదల చేసిన ఈ ట్రైలర్.. ఎమోషనల్‌గా సాగుతూ అందర్నీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. చిన్నతనం నుంచి స్నేహితులు, మధ్యలో విడిపోవడం, పెద్దయ్యాక మళ్లీ కలవడం అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చినా.. ఈ ట్రైలర్ మాత్రం కొత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ ఇద్దరి పాత్రలనే చూపిస్తూ సాగిన ఈ ట్రైలర్.. అందర్నీ మెప్పించేలానే ఉంది. ఇందులో డైలాగ్‌లు, అందులోని లోతైన భావాలు అందరికి కనెక్ట్ అయ్యేలానే కనిపిస్తోంది. 'పరిచయం, స్నేహం ఇవన్నీ కో ఇన్సిడెంట్స్.. ప్రేమించట్లేదు అంటే నువ్వంటే నచ్చలేదని కాదు.. నీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసేంత ఫీలింగ్ లేదని', 'ఒక మనిషి కావాలి అనుకోవడానికి..భయటకు కనిపించే ఒక్క ఫీలింగ్ సరిపోతుంది..

Raj Tarun Iddari Lokam Okate Trailer Releasedc

అదే వద్దను కోవడానికి.. బయటకు కనిపంచని వంద కారణాలు కావాలి..' అంటూ హీరో హీరోయిన్లు చెప్పిన ఈ డైలాగ్‌లతో సినిమాలో ఏదో కొత్త ఎమోషన్ ఉందన్న విషయం అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. జీఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X