twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhamaka: రవితేజ సినిమాలో మరో తెలుగు హీరో.. మొత్తం ముగ్గురితో రచ్చ రచ్చేనట

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు రవితేజ. అలా ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను అలరిస్తూ మాస్ మహారాజా అన్న బిరుదును అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అయితే, ఆ మధ్య పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డ రవితేజ.. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

    అనుష్క శర్మ ఎద అందాల ఆరబోత: తల్లైనా తగ్గకుండా.. కోహ్లీ భార్యను ఇలా చూశారంటే!అనుష్క శర్మ ఎద అందాల ఆరబోత: తల్లైనా తగ్గకుండా.. కోహ్లీ భార్యను ఇలా చూశారంటే!

    మాస్ మహారాజా రవితేజ ఇటీవలే 'ఖిలాడి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. దీంతో కలెక్షన్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఫలితంగా ఈ మూవీ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఇదిలా ఉండగా, ఖిలాడి సినిమా చేస్తోన్న సమయంలోనే రవితేజ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీతో పాటు 'రావణాసుర' చిత్రాలను పట్టాలెక్కించేశాడు. ఇప్పటికే వీటికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసుకున్నాడు.

    Raj Tarun Key Role in Ravi Teja Dhamaka Movie

    ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాలే కాకుండా.. మాస్ మహారాజా రవితేజ.. డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో కూడా ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి 'ధమాకా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఇందులో రవితేజ మార్క్ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నడూ చూడని కొత్త కాన్సెప్టుతో దీన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త లీకైంది.

    శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ ట్రీట్: అలా అందాలను చూపిస్తూ ఘాటుగా!శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ ట్రీట్: అలా అందాలను చూపిస్తూ ఘాటుగా!

    క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ధమాకా' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడని ఇప్పటికే ఓ న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నట్లు తెలిసింది. తనదైన శైలి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడట. ఈ రోల్ సినిమా కథనే మలుపు తిప్పే విధంగా ఉండబోతుందట. అంతేకాదు, త్వరలోనే అతడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని తెలిసింది. రవితేజ డుయల్ రోల్.. రాజ్ తరుణ్ పాత్రతో కలిపి మొత్తం ఇందులో ముగ్గురు హీరోలు సందడి చేయబోతున్నారన్న మాట.

    'ధమాకా' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 'పెళ్లిసందD' ఫేం శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రేమికుల రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసున్న పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, ఇందులో చాలా మంది సీనియర్ నటులు కూడా కీలక పాత్రలను చేస్తున్నారు.

    English summary
    Ravi Teja Now Doing Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. Raj Tarun to play Key Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X