రెమ్యూనరేషన్ లేకుండా దిల్ రాజుతో రాజ్ తరుణ్ సినిమా!
కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలు అందుకుని నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయిన రాజ్ తరుణ్... తర్వాత వరుస పరాజయాలతో ప్లాప్ హీరో లిస్టులో పడిపోయాడు. హీరోగా తనకు వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యాడు.
ఇకపై ఏది పడితే అది చేయకుండా ఆచితూచి ముందడుగు వేయాలని భావిస్తున్న రాజ్ తరుణ్ కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. త్వరలో ఈ యంగ్ హీరో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి సినిమా చేయబోతున్నారట.

టర్కిష్ ఫిల్మ్ చూసిన రాజ్ తరుణ్ దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతో దిల్ రాజును సంప్రదించారని, ఆయనకు కూడా ఈ రీమేక్ వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఏర్పడటంతో త్వరలోనే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ఇంతకు ముందు దిల్ రాజు బేనర్లో చేసిన 'లవర్' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవ్వడంతో... ఈ సినిమాకు రాజ్ తరుణ్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని, సినిమా బాక్సాఫీసు వద్ద బాగా ఆడితే అందులో కొంత భాగం అతడికి చెల్లించేలా డీల్ ఓకే అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











