ఒరేయ్ బుజ్జిగా.. పద్దెనిమిదేళ్ల కత్తి లాంటి అమ్మాయిని పంపించు..!
రాజ్ తరుణ్.. ఈ పేరు ఒకప్పుడు బాగానే వినిపించింది. అయితే కొన్నేళ్ల నుంచి మాత్రం చడీచప్పుడు లేకుండా ఉన్నాడీ హీరో. సినిమాలతో హంగామా చేయాల్సిన హీరో వివాదాలతో వార్తల్లోకెక్కాడు. తాగి వాహనం నడిపిన విషయంలో రాజ్ తరుణ్ బాగానే పాపులర్ అయ్యాడు. అయితే సినిమాల విషయం ఈ రేంజ్ పాపులార్టీ వచ్చి చాలా కాలమే అయింది.
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో ఓ వెలుగు వెలిగిన రాజ్ తరుణ్‌కు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.. కొత్తగా ట్రై చేసినా లక్ మాత్రం కలిసి రావడం లేదు.

చివరగా వచ్చిన ఇద్దరి లోకం ఒకటే కూడా బెడిసి కొట్టింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే మరోసారి తనకు అలవాటైన కమర్షియల్ అండ్ లవ్ స్టోరీతోనే ఒరేయ్ బుజ్జిగా అంటూ వస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను హరీష్ శంకర్ విడుదల చేశాడు.
ఆద్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ టీజర్‌లో పంచ్‌లు అదిరిపోయాయి. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. టీజర్ ఎండింగ్‌లో వచ్చే డైలాగ్ అదిరిపోయింది. పద్దెనిమిదేళ్ల కత్తి లాంటి అమ్మాయిని పంపించు.. అని హీరో అడిగే.. ఆ కత్తికి బట్టలేసి పంపించి అంటూ బికినీ ఫోటోకు హీరో కామెంట్ చేయడం బాగుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











