రాజ్ తరుణ్ లవర్ సూసైడ్ నోట్.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నా అంటూ లాయర్‌కు షాకింగ్ మెసేజ్!
హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ తిరుగుతున్నాడని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. 11 ఏళ్లుగా ఆయనతోనే తాను కలిసి ఉంటున్నానని, తీరా ఇప్పుడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను దూరం పెడుతున్నాడని ఆమె హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భం దాల్చడంతో రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని ఆరోపించిన లావణ్య.. దీనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను, 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్న మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది.
లావణ్య ఆరోపణల నేపథ్యంలో పోలీసులు హీరో రాజ్‌తరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 493, 506, 420ల కింద కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజ్ తరుణ్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయన కూడా లీగల్‌గానే పోరాటం చేస్తానని చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ లేకుండా తాను జీవించలేనంటూ లావణ్య ఆత్మహత్య చేసుకుంటానంటూ తన న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకరకు సందేశం పంపింది. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఇంతకీ లావణ్య ఆ సందేశంలో ఏమన్నారంటే .. తన గురించి తెలిసిన వారే తనను తప్పుగా అర్ధం చేసుకున్నారని లావణ్య వాపోయింది. రాజ్ లేని జీవితంలో నేను బతకలేను, అన్నీ కోల్పోయాను, అందరి వల్ల మోసపోయాను అంటూ లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ మారిపోయాడు, నా చావును కోరుకున్నాడు.. రాజ్ తల్లిదండ్రులు, మాల్వీ మల్హోత్రా నా చావుకు కారణం అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన కుటుంబం, న్యాయవాది దిలీప్ సుంకర, మీడియా క్షమాపణలు అంటూ ఆమె లాయర్‌కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర.. అర్ధరాత్రి పూట డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన లావణ్య ఇంటికి చేరుకుని, ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేయబోతున్నారు, రాజ్ తరుణ్ నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రోజు రోజుకు కేసు జఠిలంగా మారుతుండటంతో పరిశ్రమ వర్గాల్లోనూ రాజ్ తరుణ్ వ్యవహారం చర్చనీయాంశమైంది. అసలే కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుర్ర హీరోని లావణ్య వ్యవహారం గట్టి దెబ్బే కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అన్నింటికీ మించి ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఆర్ధిక భారం పెరుగుతుంది. వీలైనంత త్వరగా తన నిర్దోషిత్వం నిరూపించుకోని పక్షంలో రాజ్ తరుణ్‌పై ప్రజల్లో నెగటివ్ ఓపీనియన్ వెళ్తుందనే కామెంట్స్ వినిపిస్తుంది. మరి ఈ కేసు ఏ మలుపులు తిరిగి ఎలాంటి క్లైమాక్స్‌కు చేరుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











