For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఒరేయ్‌.. బుజ్జిగా'తో రాజ్ తరుణ్ రాత మారుతుందా?

|

వరుస ఫ్లాపులతో వెనుకబడిన యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మరోసారి మంచి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒరేయ్‌.. బుజ్జిగా'. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమైంది. ఈ సినిమాపై అటు రాజ్ తరుణ్, ఇటు కొండా విజయ్ కుమార్ భారీ ఆశలు పెట్టుకొన్నారు. ఈ సినిమా గురించి పలు విశేషాలను వెల్లడించారు.

నిర్మాత కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ ''ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ ఈరోజు నుంచి ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది. సెన్సిటివ్‌ లవ్‌స్టోరీ 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌గారు మరో డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్‌గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా 'ఒరేయ్‌.. బుజ్జిగా' చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

Raj Taruns Orey Bujjiga shoot on brisk pace

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సాంకేతిక వర్గం:

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

మాటలు: నంద్యాల రవి

ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

డాన్స్‌: శేఖర్‌

ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌

ఫైట్స్‌: రియల్‌ సతీష్‌

ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను)

కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి

సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌

నిర్మాత: కె.కె.రాధామోహన్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌

English summary
Raj Tarun's latest movie is Orey Bujjiga. KK Radha Mohan is the producer. Directed by Konda Vijay Kumar. Its shooting going with brisk pace.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more