కమెడియన్‌గా రాజ్ తరుణ్.. సక్సెస్ కోసం డేరింగ్ నిర్ణయం
యువ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకపోతుండటంతో ప్రస్తుతం టెన్షన్‌లో పడిపోయారు. గట్టిగా ఒక హిట్టు కొట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒక సక్సెస్‌తో మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తూ విభిన్నమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా రాజ్ తరుణ్ నటించిన ఒరే బుజ్జిగా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఆయనతో మాలవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 3వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే కొవిడ్ 19 లాక్‌డౌన్ కారణంగా ఒరే బుజ్జిగా చిత్రం రిలీజ్ వాయిదా పడింది.

ఇది ఇలా ఉండగానే, బయోపిక్ లాంటి చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా జీవితం ఆధారంగా దర్శకుడు సంతోష్ మోహన్ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్నారు. రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నారనే విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటి నటాషాను హీరోయిన్‌గా ఎంపిక చేసుకొన్నారు. దీంతో నటాషా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న మరో ఉత్తరాధి స్టార్‌గా మారారు. నటాషా ఇంతకు ముందు తమిళ హీరో జీవాతో ఓ చిత్రం నటించింది. ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాలను చూసి నటాషాను ఎంపిక చేసినట్టు సమాచారం. నటాషా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారని తెలిసింది.


Click it and Unblock the Notifications











