Raj Tarun : రాజ్ తరుణ్ ఆత్మహత్యాయత్నం .. లాస్ట్ కాల్ అతనికే, ఆ రోజు ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ - లావణ్యల వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. గతేడాది అనేక ట్విస్టులు, ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు - ప్రతి సవాళ్లతో నడిచిన ఈ కేసు సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. లావణ్య కూడా కేసులు విత్ డ్రా చేసుకుంటానని.. రాజ్‌కు క్షమాపణలు కూడా చెప్పింది. కానీ అనూహ్యంగా విల్లా కోసం జరిగిన గొడవతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఒకానొక దశలో రాజ్ తరుణ్ ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని అనుకున్నట్లు అతని మిత్రుడు, నటుడు మధునందన్ బాంబు పేల్చారు.

చిన్నప్పటి నుంచి సినిమాలపై ఇష్టంతో, సినిమాలే ప్రపంచంగా బతికాడు రాజ్ తరుణ్. సినిమాలపై పిచ్చితో తొలుత షార్ట్ ఫిల్మ్స్‌కు దర్శకుడిగానూ, వాటిలో హీరోగానూ, ఇతర పాత్రల్లో నటించాడు. అలా ఉయ్యాల జంపాలా చిత్రంతో రాజ్ తరుణ్ కోరిక తీరింది. ఆ సినిమాకు బోల్డెన్నీ ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు , కింగ్ అక్కినేని నాగార్జున , దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. ఇక చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అప్పటికే దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించిన అవికా గోర్‌ ఇందులో హీరోయిన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

raj tarun went depression during lockdown time says actor Madhunandan

ఉయ్యాల జంపాలా హిట్ కావడంతో ఆ తర్వాత సినిమా చూపిస్త మావలోనూ మరోసారి జోడీ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ కావడంతో రాజ్ తరుణ్‌కు అవకాశాలు క్యూకట్టాయి. కుమారి 21 ఎఫ్‌ బ్లాక్ బస్టర్‌తో ఈ కుర్రాడి పేరు ఇండస్ట్రీలో మారు మోగింది. అయితే ఆ తర్వాత ఆ జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకే టే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా తదితర సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

కెరీర్‌పరంగా ఇబ్బందులకు తోడు.. వ్యక్తిగత సమస్యలతో రాజ్ తరుణ్ రేసులో వెనుకబడ్డాడు. అయినప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు. లావణ్య రంగ ప్రవేశంతో రాజ్ తరుణ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా హైకోర్టును ఆశ్రయించి మందుస్తు బెయిల్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. అయితే గతంలో భారతదేశంలో కరోనా విజృంభించిన సమయంలో లాక్‌డౌన్ కారణంగా రాజ్ తరుణ్ ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని అతని మిత్రుడు, నటుడు మధునందన్ తెలిపారు.

ఇటీవల మధునందన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో రాజ్ తరుణ్ కుటుంబం గోవా ట్రిప్‌కు వెళ్లిందని అప్పుడే దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో రాజ్ తన ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాడని చెప్పారు. రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తారని అనుకుంటే ఏకంగా 2 నెలల కొనసాగిందని.. ఓ రోజున రాజ్ నాకు ఫోన్ చేసి ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతకలేకపోతున్నానని , ఓ వారం ఇలాగే ఉంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని మధునందన్ తెలిపారు.

దాంతో భయపడ్డ తాను తన ఫ్రెండ్ సాయంతో ఎలాగోలా రాజ్ తరుణ్‌ని తన ఇంటికి రప్పించానని.. తన అపార్ట్‌మెంట్‌లో పిల్లలతో ఆడుకుంటూ దాదాపు 3 వారాల పాటు హాయిగా ఉన్నాడని మధు చెప్పారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌కు సడలింపు ఇవ్వడంతో గోవా నుంచి అతని కుటుంబం తిరిగి హైదరాబాద్‌కు వచ్చేయడంతో రాజ్ తన ఇంటికి వెళ్లాడని వెల్లడించారు. లావణ్య వ్యవహారం నేపథ్యంలో ప్రస్తుతం మధునందన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: raj tarun madhunandan lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X