నెల రోజులు.. మస్తాన్ సాయి అరాచకం.. కీలక విషయాలు చెప్పిన లావణ్య.!

మస్తాన్ సాయి.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తదితర అంశాలపైనా పోలీసులు ఆయన కేసును విచారిస్తున్నారు. రాజ్ తరుణ్, లావణ్య విడిపోవడానికి మస్తాన్ సాయినే కారణమని గతంలో లావణ్య తన ఫిర్యాదు లో పేర్కొంది. అతను ఫోన్ కాల్ లీక్స్ చేయడంతోనే రాజ్ తరుణ్ తో రిలేషన్ బ్రేక్ అయ్యిందని, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది మస్తాన్ సాయి అని లావణ్య తెలిపింది. దీంతో పోలీసులు నిన్న అతన్ని అరెస్ట్ చేసిన స్ట్రాంగ్ గా విచారణ కొనసాగిస్తున్నారు.

జైలు లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్ ను పోలీసులు ఇవ్వాళ కూడా విచారించారు. ఇది వరకే పోలీసులు మస్తాన్ నుంచి హార్డ్ డిస్క్ ను సేకరించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా నార్సింగి పోలీసులు మస్తాన్ సాయి అరచాకాలపై విచారణను కొనసాగిస్తున్నారు. ఆయన వద్ద 300 మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నాయనే ఆరోపణపై ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు ఆయన హార్డ్ డిస్క్ లో ఎన్ని వీడియోలున్నాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అలాగే మస్తాన్ ఇంట్లో డ్రగ్స్ పార్టీలు జరిగిన నేపథ్యంలో ఆ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Raj Tharun Ex Girlfriend Lavanya Revealed Shocking Points about Mastan Sai

డ్రగ్స్ అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి. సప్లైదారు ఎవరు? లాంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఫిబ్రవరి 15తో మస్తాన్ సాయి కస్టడీ ముగినుండటంతో ఎలాంటి వివరాలు వెల్లడించనున్నారనేది చూడాలి. ఇక మస్తాన్ సాయిపై పోలీసుల విచారణ కొనసాగుతుండగానే.. మరవైపు లావణ్య మస్తాన్ సాయి గురించి కీలక విషయాలను వెల్లడించింది. మస్తాన్ సాయికి, లావణ్యకు ఎన్ని రోజుల పరిచయం ఉందో వెల్లడించింది. మస్తాన్ సాయితో లావణ్యకు కేవలం నెల రోజుల పరిచయమే ఉందని తెలిపింది. ఆలోపు అంతా ముగిసిపోయిందని మీడియాతో తెలిపింది.

మస్తాన్ సాయితో తనకు 2022 అక్టోబర్ లో పరిచయమని తెలిపింది. అప్పటి నుంచి సరిగ్గా నెలరోజులకు అతనితో అన్నీ అయిపోయాయంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. పరిచయమై దూరం పెట్టిన మూడు నెలల్లోనే మస్తాన్ సాయిపై తానే గుంటూరులో కేసు నమోదు చేసినట్టు తెలిపింది. వెంటనే పోలీసులు కూడా స్పందించి ఆయన విల్లాను ఖాళీ చేయించారు. దీంతో అతనికి పార్టీలు చేసుకోవడానికి విల్లా లేకుండా పోయింది. నేను మొట్టమొదటిగా హైదరాబాద్ లోని తన విల్లాను ఖాళీ చేయించడమే నా మొదటి లక్ష్యంగా పెట్టుకున్నాను. అదే జరిగింది.

Raj Tharun Ex Girlfriend Lavanya Revealed Shocking Points about Mastan Sai

తర్వాత మస్తాన్ సాయి గుంటూరులోని తనకున్న రెండు మూడు ఇంటిలోనే పార్టీలు చేస్తున్నాడు. ఇక అక్కడ కూడా అతడిని కట్టడి చేసేందుకే నేనే స్వయంగా నార్కొటిక్ ఆఫీసర్లకు మెయిల్స్ పెట్టానని చెప్పారు. ఇక మస్తాన్ సాయి తన తల్లిదండ్రులు లేని సమయంలో.. వారు దర్గాకు వెళ్లిన సందర్భాల్లో పార్టీలు చేస్తుంటారని చెప్పారు. ఇక మస్తాన్ సాయి అరాచకాలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. ఈ కేసులోని కీలకమైన వివరాలను పోలీసులు విచారణ అనంతరం వెల్లడించాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: raj tharun lavanya mastan sai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X