టాలీవుడ్ లో మరో విషాదం.. మెగా ఫ్యామిలీ సన్నిహిత వ్యక్తి మృతి..!

కరోనా సెకండ్ వేవ్ ఎవర్నీ వదలడం లేదు.. సెలబ్రిటీల మొదలు సామాన్యుల దాకా ఈ సెకండ్ వేవ్ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి వేవ్ లో కేసులు తక్కువగానే ఉండేవి మరణాలు తక్కువగానే ఉండేవి. కానీ ఈ సెకండ్ వేవ్ మొదలయ్యాక కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి కరోనా కారణంగా మరణించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

మరో వ్యక్తి

మరో వ్యక్తి

కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక కరోనా ధాటికి టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది యువ దర్శకులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని సినిమాలకు దర్శకత్వం విభాగంలో పనిచేసిన అంబటి రాజా కన్నుమూసినట్లు తెలుస్తోంది.. ఆయన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు చెబుతున్నారు. ఆయన గత కొద్ది రోజుల క్రితం కరోనా సోకగా ఆయన చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయన నిన్న పొద్దుపోయాక కన్నుమూసినట్లు తెలుస్తోంది.

 మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు

మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు

అంబటి రాజా మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా నాగబాబుతో ఆయన ఎక్కువ సన్నిహితంగా మెలిగే వారని తెలుస్తోంది. నాగబాబు డిజిటల్ మీడియా వేదికగా ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలలో ఈయన కూడా భాగం అయ్యారని తెలుస్తోంది. ఆయన చనిపోవడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

కలచివేస్తోంది

కలచివేస్తోంది

రాజా మరణానికి సంబంధించి ముందుగా వినాయకుడు సినిమా ఫేమ్ కృష్ణుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ''నాగబాబుకు చాలా దగ్గరి వ్యక్తి, నా శ్రేయోభిలాషి రాజా మరణం కలచివేస్తోంది'' అని పేర్కొన్న ఆయన ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అని అన్నారు. దేవుడు మంచి వాళ్ళని ముందే తీసుకు వెళ్లి పోతారు అని కృష్ణుడు కామెంట్ చేశారు.

Recommended Video

Jr NTR వదులుకున్న Blockbusters | Happy Birthday NTR || Filmibeat Telugu
షాక్ అయ్యాను

షాక్ అయ్యాను

ఇక ఆయన గురించి మెగా ఫ్యామిలీకి చెందిన వెంకట్ రాహుల్ స్పందిస్తూ ఆయన మరణ వార్త విని షాకయ్యాను అని ఆయన కుటుంబం ఈ సమయంలో బలంగా ఉండాలని కోరుతున్నానని అన్నారు. ఇక జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ కూడా రాజా మరణానికి సంబంధించి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు వి.ఎన్ ఆదిత్య కూడా ఆయన మరణం గురించి స్పందించారు. ఆయన మరణం గురించి తెలిసి షాక్ అయ్యానని, ఆయన కుటుంబానికి బలం చేకూర్చాలని ఆయన కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X