మినీ బాహుబలిలా ‘రథం’.. సినిమా అద్భుతంగా.. నిర్మాత రాజా

రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మిస్తున్న చిత్రం రథం. ఈ చిత్ర టీజ‌ర్‌, ఒక పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రథంపై భారీగా అంచ‌నాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా రిలీజ్ చేశారు.

'బిల్ గేట్స్' అంటూ ప్రారంభమయ్యే ఈ పాట మాస్‌ను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. త్వరలోనే సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రాజా మాట్లాడుతూ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతంగా వచ్చింది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అవుతుంది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి అభినందించారు. ఇది మినీ బాహుబలి అవుతుందనే నమ్మకం ఏర్పడింది అని అన్నారు.

Raja Darapuneni: Ratham Movie will be mini Baahubali

కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాజ్‌గురు ఫిలిమ్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేశాం. త్వరలోనే రెండో సినిమా ప్రారంభమవుతుంది అని రాజా తెలిపారు.

Raja Darapuneni: Ratham Movie will be mini Baahubali

గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రథం తెరకెక్కింది. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X