twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం జగన్ నిర్ణయం బాగుంది.. దాని తరువాత విద్యావ్యవస్థ మీద వచ్చిన పుస్తకం ఇదే..

    |

    విద్యావ్యవస్థలో లోపాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషిస్తూ... 'రిషి', 'ఆంధ్రాపోరి' చిత్రాల దర్శకుడు రాజ్‌ మాదిరాజు రాసిన నవల 'సిరా'. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్కకావిష్కరణ జరిగింది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని యంగ్రీస్టార్‌ రాజశేఖర్‌కు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ అందజేశారు. రాజ్‌ మాదిరాజు తల్లితండ్రులకు యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాలను అందజేశారు.

    ఏపీ సీఎం తీసుకొచ్చిన విధానం నచ్చింది..

    ఏపీ సీఎం తీసుకొచ్చిన విధానం నచ్చింది..

    ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ‘విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే... కారణం మనమే. మన వ్యవస్థ, ప్రభుత్వాలు. మనిషి జీవితంలో చదువుకునే సమయం ఒత్తిడితో కూడుకున్నది. ఒత్తిడి వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ బుక్‌ ఒక విజిల్‌ బ్లోయర్‌ కావాలనీ, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను ప్రభుత్వాలు తీసుకురావాలనీ, ప్రయివేట్‌ సంస్థలు కాకుండా, ప్రభుత్వమే విద్యా వ్యవస్థను నడపాలనీ బావుంటుందని అనుకుంటున్నా. ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన చేయాలని ఏపీ సీఎం జగన్‌గారు తీసుకొచ్చిన విధానం నాకు నచ్చింది. మన భాష అంతరించకుండా, తెలుగును కంపల్సరీగా పెట్టుకుని ఇంగ్లిష్‌లో టీచింగ్‌ చేస్తే మంచిద'ని అన్నారు.

     విద్యావ్యవస్థ మీద వచ్చిన పుస్తకం ఇదే..

    విద్యావ్యవస్థ మీద వచ్చిన పుస్తకం ఇదే..

    కృష్ణవంశీ మాట్లాడుతూ..‘నేను ఇంకా ఈ పుస్తకాన్ని చదవలేదు. సో... దాని గురించి ఏం మాట్లాడలేను. కానీ, రాజ్‌ మాదిరాజు ఈ పాయింట్‌ చెప్పాడు. విద్యావ్యవస్థ మీద పుస్తకం రాశానని చెప్పాడు. నాకు నచ్చింది. చేతన్‌ భగత్‌ ‘త్రీ మిస్టేక్స్‌' తర్వాత విద్యావ్యవస్థ మీద వచ్చిన పుస్తకం ఇదే అనుకుంటున్నా. రాజ్‌ నాకు ఏడాదిన్నరగా తెలుసు. అతడితో స్నేహం ఏర్పడింది. అతడిలో చాలా నాలెజ్డ్‌ ఉంది. ఒక్కోసారి మాట్లాడుతుంటే భయం వేస్తుంది. రాజ్‌ మాదిరాజు ప్రయత్నం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

     మనిషి అంచలు అంచలుగా ఎదగడం మంచిదే..

    మనిషి అంచలు అంచలుగా ఎదగడం మంచిదే..

    యండమూరి వీరేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ‘నేను రాజ్‌ మాదిరాజును చూడటం ఇదే తొలిసారి. కుర్రాడు బావున్నాడు. చిన్నప్పుడు నేనూ అలాగే ఉండేవాణ్ణి. ఆయన సినిమా ఫీల్డ్‌ నుండి రచయితగా వచ్చాడు. నేను రచయిత నుండి సినిమా ఫీల్డ్‌కి వెళ్లాను. ఆయన తొలి సినిమా సరిగా ఆడలేదు. దర్శకుడిగా నా తొలి సినిమా సూపర్‌ డూపర్‌ ఫ్లాప్‌. ఆయన తర్వాత సినిమాలు బాగా ఆడాయి. అవార్డులు వచ్చాయి. మనిషి అంచలు అంచలుగా ఎదగడం మంచిదే. పాపులర్‌ నవలలు తగ్గుతున్న ఈ టైమ్‌లో, నేను దాదాపు రిటైర్‌ అయ్యాను కాబట్టి రాజ్‌ మాదిరాజును మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా'అన్నారు.

    నేరుగా నేను కోర్టుకు వెళ్లి వాదించవచ్చనేంత ధీమా..

    నేరుగా నేను కోర్టుకు వెళ్లి వాదించవచ్చనేంత ధీమా..

    రచయిత లక్ష్మీభూపాల్‌ మాట్లాడుతూ ‘ఎన్నో నవలలు రాసిన అనుభవమున్న రచయితగా రాజ్‌ మాదిరాజు ఈ నవల రాశారు. తన నవలలతో ఎందరిలో స్ఫూర్తి నింపిన యండమూరి గారితో ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ‘సిరా' చదివిన తర్వాత నేరుగా నేను కోర్టుకు వెళ్లి వాదించవచ్చనేంత ధీమా కలిగింది. త్వరలో ఇది సినిమాగా రాబోతుందని తెలిసింది'అని అన్నారు.

    Recommended Video

    #CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
    రాజశేఖర్‌గారిని మైండ్‌లో పెట్టుకుని రాసుకుంటూ వచ్చాను...

    రాజశేఖర్‌గారిని మైండ్‌లో పెట్టుకుని రాసుకుంటూ వచ్చాను...

    రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ ‘రాస్తే యండమూరిలా రాయాలి, తీస్తే కృష్ణవంశీలా తీయాలి. చేస్తే రాజశేఖర్‌లా చేయాలనే తరంలో పెరిగాను. వాళ్లు ముగ్గురూ ఇక్కడ ఉన్నారు. నేనిది పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నా. చాలా డెప్త్‌ ఉన్న కథ ఇది. లీగల్‌ సిస్టమ్‌, ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌, టీనేజర్స్‌ మైండ్‌సెట్‌... ఇందులో మూడు ఉన్నాయి. ‘సిరా'లో హీరోలు ఇద్దరు. మల్టీస్టారర్‌. అందులో ప్రొఫెసర్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. దాన్ని రాజశేఖర్‌గారిని మైండ్‌లో పెట్టుకుని రాసుకుంటూ వచ్చాను. ఈ రోజు ఆయన్ను నా కళ్ల ముందు చూస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్లు అందరికీ థ్యాంక్స్‌' అని అన్నారు.

    English summary
    Raja Sekhar And Krishna Vamsi Speech At Raj Madiraju SIRA Novel. Rishi, AAndhra Pori Movies Director Raj Written A Novel On Education System. Director Krishna Vamsi And Hero Rajasekhar Speech At Novel Launch Event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X