Chiranjeevi అభిమానులకు గ్రేట్ సర్‌ప్రైజ్.. నిర్మాత 88 రామారెడ్డి క్రేజీ న్యూస్ రివీల్!

మెగాస్టార్ చిరంజీవిని పిచ్చిగా ఆరాధించిన ఓ అభిమాని ప్రస్తుతం టాలీవుడ్‌లో నిర్మాతగా మారారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామారెడ్డి తన కలలను సాకారం చేసుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. థియేటర్లలో చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆరాటపడిన ఆయన ఏకంగా మెగాస్టార్ నటించిన సినిమా రాజా విక్రమార్క టైటిల్‌‌తో సినిమాను నిర్మిస్తున్న తన జన్మదినం సందర్బంగా పలు విషయాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా కార్తీకేయ గుమ్మకొండతో నిర్మిస్తున్న సినిమా గురించి, అలాగే రాజా విక్రమార్క చిత్రంలో చిరంజీవి అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ కలిగించే అంశం గురించిన విషయాలను పంచుకొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

నిర్మాతగా నాకు కార్తీకేయ నా తొలి హీరో. ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ఇలాంటోళ్లు ఉంటారా? అనే ఆశ్చర్యం కలిగింది. కార్తీకేయ గురించి మరో మాట అవసరం లేదు. చాలా చాలా మంచోడు. నంబర్ వన్ మనిషి అంటూ రామారెడ్డి తెలిపారు. RX 100 సినిమా నుంచి ఆయన చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. డిస్టిబ్యూటర్, నిర్మాత ద్వారా ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయనకు సరిపడే కథ లభించడంతో ఆయనతో సినిమా తీసే అవకాశం దక్కింది. తప్పకుండా రాజా విక్రమార్క సినిమా మంచి విజయం సాధిస్తుంది. నాకు నిర్మాతగా మంచి సక్సెస్ లభిస్తుందనే ఆశాభావం ఉంది అని రామారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

 Chiranjeevi

రాజా విక్రమార్క సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ సెట్స్‌కు వెళ్లాను. ఒక్క సినిమాతో పది సినిమాలు తీసిన అనుభవం వచ్చింది. కరోనా వల్ల సినిమా రిలీజ్ కొంత ఆలస్యమైందనే బాధ ఉంది. సినిమా బాగా రావడంతో మా టీమ్ చాలా హ్యపీగా ఉంది. దేవుడి దయ వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా హ్యాపీగా పూర్తయింది అని రామారెడ్డి పేర్కొన్నారు. నా పేరు ముందు 88 అని పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. నాలుగైదు సినిమాలు నిర్మించిన తర్వాత ఆ సీక్రెట్ రివీల్ చేస్తాను. వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటాను అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

88 Rama Reddy

రాజా విక్రమార్క సినిమాలో చిరంజీవి గారి అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఉంది. అదేమిటనేనది ఇప్పుడే రివీల్ చేస్తే బాగుండదు. అభిమానులు అందరూ ఈలలు వేస్తూ గోల గోల చేసేలా ఉంటుంది అని రామారెడ్డి పేర్కొన్నారు. రాజా విక్రమార్క తర్వాత పది కథలు విన్నాను. అందులో రెండు నచ్చాయి. బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. హీరోలకు కథలు వినిపించాం. రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఏది ముందు ప్రారంభం అవుతుందనే విషయం త్వరలోనే వెల్లడిస్తా. ప్రధానంగా నాకు యాక్షన్ ఎంటర్టైనర్స్, కమర్షియల్ సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టం అని రామారెడ్డి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X