మహేశ్, రాజమౌళి టీమ్ కీలక ప్రకటన.. సినిమాలో అతడు భాగం కాదంటూ!

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లలో సినిమాలు రావాలని ఆయా స్టార్ల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా కోరుకుంటూ ఉంటారు. అలాంటి కలయికల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి జోడీ ఒకటన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరూ కలిసి ప్రాజెక్టు చేయాలని చాలా డిమాండ్లు వినిపించాయి. చివరికి ఈ కాంబో సెట్ అయింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాని నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇంకా మొదలు పెట్టలేదు. అన్నీ రెడీ అయిన తర్వాతనే రెగ్యూలర్ షూట్ ప్రారంభించాలని రాజమౌళి ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Rajamouli and Mahesh Babu Movie Team Clarity On Casting Rumors

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే క్రేజీ సినిమా స్క్రిప్ట్ బాధ్యతను జక్కన్న ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించినట్లు స్వయంగా వెల్లడించాడు. ఆయన కూడా ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్‌లో రాబోతుందని హిట్ ఇచ్చేశారు. అప్పటి నుంచి దీనిపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు.

ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేసింది. అందులో రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టు కాస్టింగ్‌కు సంబంధించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇస్తున్నట్లు సదరు సంస్థ తెలిపింది.

Rajamouli and Mahesh Babu Movie Team Clarity On Casting Rumors

ఇటీవలే ఓ జాతీయ వెబ్‌సైట్ వీరేన్ స్వామి అనే వ్యక్తి రాజమౌళి, మహేశ్ బాబు సినిమా కాస్టింగ్‌‌ సభ్యుడు అని వార్త రాసింది. దీనిపైనే నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. 'వీరేన్ స్వామి మా సినిమాలో ఏ విధంగానూ భాగం కాలేదు. దీన్ని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాం. అవసరమైనప్పుడు సినిమా గురించి అన్ని అధికారిక ప్రకటనలు నిర్మాణ సంస్థ తెలుపుతుంది' అని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. దీనికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు భాగం కాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X