RRRతో కలిసిన మరో R.. ఓకే ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోలతో రాజమౌళి.. ఫొటో వైరల్
టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధిక భారీ స్థాయిలో విడుదల అవుతున్న మల్టీస్టారర్ మూవీ RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి నటించిన ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా తెర పైకి తీసుకు రాబోతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రమోషన్ విషయంలో కూడా అంతకు మించి అనేలా ముందుకు వెళ్తున్నారు. ఇక ఇటీవల RRR హీరోలతో మరో మరో హీరో కూడా కలవగా రాజమౌళి ఆ ఫోటోలో స్టిల్ ఇచ్చారు.

హైలెట్ అయ్యేలా..
దర్శక ధీరుడు రాజమౌళి మొదటి నుంచి కూడా సినిమా ప్రమోషన్ విషయంలో చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టాలి అనే విషయం దగ్గరనుంచి సాంగ్స్ విడుదల చేసే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. సినిమా కు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా హైలెట్ అయ్యేలా చేస్తున్నారు.

నార్త్ లో ప్రమోషన్స్..
ఇప్పటికే ముంబైలో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది సౌత్ ఇండస్ట్రీలో సినిమాకు భారీగానే ఓపెనింగ్స్ అందుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో మాత్రం ఇంకా జనాలు సినిమా ధియేటర్స్ వరకు రావడానికి ధైర్యం చూపడం లేదు. ఇక RRR అక్కడి వారిని ఎక్కువగా ఆకట్టుకోవాలి అని రాజమౌళి ముంబైలోనే వీలైనంత ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు.

హిందీ మార్కెట్ పై ఎక్కువగా..
ఇటీవల ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన టోటల్ ఫుటేజ్ ను ఎడిటింగ్ తరువాత రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి హిందీ మార్కెట్ ను ఎక్కువగా టార్గెట్ చేసినట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సినిమాలో అలియా భట్ అజయ్ దేవ్ గన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించడం ద్వారా కూడా అటువైపు జనాలు సినిమాపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.

RRR లో మరో R
ఇక సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా గడుపుతున్న రాజమౌళి ఇటీవల తన ఇద్దరి హీరోలకు మరొక R ని కూడా జత చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. రామారావు రామ్ చరణ్ రాజమౌళి పేర్లు వచ్చేలా RRR సినిమా టైటిల్ సెట్ చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు రానా దగ్గుబాటి కూడా కలిసి ఉండడంతో మొత్తం RRR R లు ఒకే ఫ్రేమ్లో ఉంటే ఎలా ఉంటుందో చూడండి అని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

రానా దగ్గరకు ఎందుకంటే..?
రానా దగ్గుబాటి ముంబైలో ఒక ప్రత్యేకమైన ఫ్లాట్ లో ఉంటున్నాడు. ఇక అతని ఇంట్లోకి ఇటీవల రాజమౌళి తో పాటు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ ముగ్గురు సేదతీరేందుకు రానా దగ్గుబాటితో కాసేపు కాలక్షేపం చేసినట్లు సమాచారం. సినిమాను జనవరి 7వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











