షూటింగ్ మానేస్తా.. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్.. ట్వీట్‌తో రాజమౌళి సెన్సేషన్

దర్శక ధీరుడు రాజమౌళి షూటింగ్ మానేస్తా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం RRR షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టడం చూసి షాకయ్యారు నెటిజన్లు. పైగా తాను షూటింగ్ మానేయడానికి కారణం కూడా చెప్పారు జక్కన్న. ఇంతకీ రాజమౌళి షూటింగ్ మానేస్తా అని ఎందుకంటున్నారు? వివరాల్లోకి పోతే..

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో జక్కన్న.. RRR షూటింగ్‌

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో జక్కన్న.. RRR షూటింగ్‌

డీవీవీ దానయ్య నిర్మాణంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా RRR మూవీ తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఇప్పటినుంచి ప్రతీ రోజు విలువైందే. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో 'షూటింగ్ మానేస్తా' అనేశారు జక్కన్న.

ఇందుకు కారణం.. రాజమౌళి మెసేజ్

ఇందుకు కారణం.. రాజమౌళి మెసేజ్

అయితే ఇందుకు కారణం కూడా తన పోస్ట్‌లో పేర్కొన్నారు రాజమౌళి. తాను డిసెంబర్ 25న RRR షూటింగ్‌కి బ్రేక్ ఇస్తున్నా అని తెలిపారు రాజమౌళి. షూటింగ్ నుంచి ఒకరోజు విరామం తీసుకుంటున్నానని, దానికి కారణం ''మత్తు వదలరా'' సినిమా అని ఆయన పేర్కొన్నారు.

కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా..

కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా..

రాజమౌళి అన్న కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తు వదలరా' సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు కీరవాణి మరో కొడుకు కాలబైరవ సంగీతం సమకూర్చాడు. రితేష్ రానా దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

భావోద్వేగానికి గురవుతున్నా.. జక్కన్న ట్వీట్

ఈ నేపథ్యంలో రాజమౌళి ‘మత్తు వదలరా' సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్ళు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో సినీ అరంగేట్రం చేస్తున్నారు. నేను భావోద్వేగానికి గురవుతున్నాను. దర్శకుడు రితేష్ రానా బాగా తీశారు. మూవీ విడుదల రోజు (డిసెంబర్ 25) నేను షూటింగ్ మానేస్తా అంటూ ట్వీట్ చేశారు.

RRR మత్తు వదిలినట్లే

RRR మత్తు వదిలినట్లే

ఎన్టీఆర్, రామ్ చరణ్,ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి ‘మత్తు వదలరా' సినిమా చుడనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ మెసేజ్‌తో ఒక్కసారిగా RRR మత్తు వదిలించారు రాజమౌళి. ఎప్పటికప్పుడు RRR షూటింగ్ అప్‌డేట్స్ ఫాలో అవుతున్న ప్రేక్షకులకు ఆ ఒక్కరోజు RRR మత్తు వదిలినట్లే మరి!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X