పవన్ కళ్యాణ్‌తో పోల్చకండి.. ఆయనతో సినిమా చేయడం కష్టమే: రాజమౌళి
దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి లాక్ డౌన్ లో వరుసగా ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్నారు. సాధారణంగా సినిమా విడుదల ఉంటే తప్ప ఎక్కువగా మీడియా ముందుకు రాని దర్శకధీరుడు ఇప్పుడు మాత్రం న్యూస్ ఛానెల్స్ లో తన ఆలోచనల గురించి వివరణ ఇస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న RRR సినిమాతో పాటు నెక్స్ట్ ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కరోనా భయం..
కరోనాపై కూడా దర్శకుడు రాజమౌళి ఇంటర్వ్యూలలో స్పందిస్తున్నారు. కరోనా భయం అందరిలో ఒక పెను మార్పును తీసుకు వచ్చిందని ఇక నుంచి కొత్త తరహా ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందని చెబుతూ.. కరోనా వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా బావున్నాయని అన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంట్లో పనులు చేస్తున్నాను అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.

పవర్ స్టార్ తో సినిమా కష్టమే..
పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని కొన్నిసార్లు ఆయనను కలిశాను కానీ కుదరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఆయన చాలా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. నాతో సినిమా అంటే చాలా సమయం పడుతుంది. ఆయనకు తగ్గట్టు ఒక మాంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కి సంబంధించిన కథ దొరికితే మాత్రం తప్పకుండా చేస్తానని రాజమౌళి తెలిపారు.

ఆయనతో పోల్చకండి..
పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి సమాజం పట్ల ఉన్న బాధ్యత, ఆయానకుండే సహాయం గుణం మిలో కూడా ఉందనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ఆయనతో నన్ను పోల్చడం కరెక్ట్ కాదు. పవర్ స్టార్ చేసే మంచి పనుల్లో నేను ఒక శాతం కూడా చేయలేదు. ఆయనకు సరితూగే వ్యక్తిని నేను కాదు అని వివరణ ఇచ్చారు.
Recommended Video

బాలయ్యతో సినిమా చేయాలని..
ప్రతి ఒక్క దర్శకుడు ప్రతి ఒక్క స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటాడు. హీరోలను ఏ విధంగా చూపిస్తే కరెక్ట్ గా ఉంటుందో అనే ఆలోచన నిత్యం నా మైండ్ లో కలుగుతూనే ఉంటుంది. ఆ విధంగా చాలా సార్లు బాలక్రిష్ణతో ఇలాంటి సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాను. కథ సెట్టయితే బాలయ్య బాబుతో కూడా మంచి సినిమా ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications











