Globe Trotter Event: మహేశ్ బాబు మూవీ ఈవెంట్.. రాజమౌళి రివీల్ చేసిన సర్‌ప్రైజ్ ఇదే!

Globe Trotter Event: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు - దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ గ్లోబల్‌ అడ్వెంచర్‌ మూవీ SSMB29. ఈ మూవీపై ఏర్పడిన అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ రివీల్‌, మహేశ్‌బాబు లుక్‌ రివీల్‌ నేడు జరిగే 'గ్లోబ్‌ ట్రాటర్‌' ఈవెంట్‌లో జరగబోతుంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్‌లో అసలేం రిలీజ్ చేస్తారనేది అభిమానుల మదిలో బోలెడన్ని సందేహాలు. ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ వేసిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తీస్తున్న కొత్త సినిమా టైటిల్ ఏంటో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. హైదరాబాద్ వేదికగా ఈరోజు (నవంబరు 15) సాయంత్రం 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా 100 అడుగుల ఎత్తుతో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేయడం, మూడు నిమిషాల స్పెషల్‌ వీడియో సిద్ధం చేయడం, భారీ టెక్నికల్‌ సెటప్‌ అని ఈ ఈవెంట్‌ను ఇకెంత పెద్ద స్థాయిలో ప్లాన్‌ చేశారో చెబుతున్నాయి.

Rajamouli Confirms SSMB29 Surprise Title amp amp Concept Video to Be Unveiled at Globe Trotter Event

ఈవెంట్‌లో ఏం రిలీజ్‌ చేయబోతున్నారు? టైటిల్‌ మాత్రమేనా? లేక మహేశ్‌బాబు లుక్‌తో పాటు టీజర్‌ లాంటి వీడియోనూ విడుదల చేస్తారా? అనే ప్రశ్నలతో సోషల్‌ మీడియా చర్చ నడుస్తున్న సమయంలో స్వయంగా రాజమౌళి ట్వీట్‌ చేశారు. ఈ సందేహాలన్నింటికి చెక్ పెడుతూ.. ''గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో SSMB29 టైటిల్‌తో పాటు చిత్రంలోని ప్రధాన కాన్సెప్ట్‌ను చూపించే స్పెషల్‌ వీడియోను ప్రదర్శిస్తాం. ఈవెంట్‌లో స్క్రీన్‌పై విడుదలైన వెంటనే అదే వీడియోను యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంచుతాం" అని రాజమౌళి స్పష్టంగా వెల్లడించారు.

ఈ ట్వీట్‌తో ఒక్కసారిగా ఫ్యాన్స్‌లో హైప్‌ మరింత పెరిగిపోయింది. ఈ ప్రత్యేక వీడియో మూడు నిమిషాలపాటు కొనసాగనున్నట్టు సమాచారం. ఇందులో మహేశ్‌బాబు పాత్ర గ్లింప్స్‌, అడ్వెంచర్ మూవీ కాన్సెప్ట్‌, ప్రియాంక చోప్రా-పృథ్వీరాజ్‌ లుక్స్‌, ప్రధాన కథకు సంబంధించిన విజువల్స్‌ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే మూవీ యూనిట్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 'కుంభ' లుక్‌, ప్రియాంక చోప్రా 'మందాకిని' లుక్‌లను విడుదల చేసింది. వీటిపై మిక్స్డ్ టాక్ వచ్చినా.. ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం మహేశ్‌బాబు లుక్‌పైనే ఉంది. ఆయన లుక్‌ను ఈ స్పెషల్‌ వీడియోలోనే చూపిస్తారనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. మరోవైపు టైటిల్‌పై 'వారణాసి', 'రుద్ర', 'సంచారి', 'గ్లోబ్‌ట్రాటర్' వంటి పేర్లు గత వారం రోజులుగా నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. మహేశ్‌ రిలీజ్‌ చేసిన లాకెట్‌ పోస్టర్‌ను పరిశీలిస్తే 'వారణాసి' టైటిల్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని పలువురు ఊహిస్తున్నారు. అయితే అసలు నిజం కొన్ని గంటల్లోనే వెలుగులోకి రానుంది.

ఇక గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌ కు చీఫ్ గెస్ట్ గా హాలీవుడ్‌ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ కూడా హాజరవుతారనేది ఫిల్మ్‌నగర్‌లో గట్టిగా వినిపిస్తుంది. అలాగే టాలీవుడ్‌ నుండి పూరి జగన్నాథ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి దర్సకులు, బాలీవుడ్‌ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఒక్క ఈవెంట్‌ ద్వారా రాజమౌళి ఈ సినిమాను గ్లోబల్‌ స్టాండర్డ్స్‌లో ఎలా ప్రెజెంట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారో స్పష్టమవుతోంది.

మొత్తంగా, రాజమౌళి ట్వీట్‌తో 'గ్లోబ్‌ ట్రాటర్' ఈవెంట్‌పై ఉన్న ఉత్కంఠ రెట్టింపు అయింది. టైటిల్‌ ఏంటి? మహేశ్‌బాబు లుక్‌ ఎలా ఉంటుంది? వీడియోలో ఏముందో? అన్న ప్రశ్నలకు ఈరోజే సమాధానం రానుంది. SSMB29 గ్లోబల్‌ లెవెల్‌ రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More from Filmibeat

Read more about: rajamouli mahesh babu ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X