"పుష్ప 2" క్రెడిట్ కూడా జక్కన్నదే .. ఆ ఒక్క మాటతోనే ఇంతటి విధ్వంసం!
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌లో తెలుగు సినిమాలు ఏ లెవెల్లో దుమ్ము లేపుతున్నాయో తెలిసిందే. ఈ ఒక్క ఏడాదిలోనే పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన తెలుగు చిత్రాలు దాదాపు అన్నీ సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు కొల్లగొట్టాయి. లేటెస్ట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అనే చిత్రం ఇండియా వైడ్ గా కొత్త రికార్డులు సెట్ చేస్తోంది.
ఇపుడు ఒక పుష్ప 2 అయినా.. దేవర అయినా .. కల్కి 2898 ఎడి అయినా ఇలా ఏ పాన్ ఇండియా సినిమా వచ్చినా.. ఏ తెలుగు సినిమా హిందీలో అదరగొట్టినా అందుకు ప్రధాన కారణం డెఫినెట్ గా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన స్టార్ట్ చేసిన బాహుబలి ప్రయాణంతో ఇండియన్ సినిమా ట్రెండ్ మొత్తం మారిపోయింది.

ఇక్కడ నుంచి పాన్ ఇండియా మార్కెట్ అలాగే సీక్వెల్స్ హవాకి కూడా జక్కన్నే మూలకారణం అని కూడా చెప్పాలి. ఇలా పాన్ ఇండియా సినిమాల విషయంలో ప్రస్తుతం ఏ సినిమా వస్తున్నా కూడా అందుకు ప్రధాన కారణం రాజమౌళి అనే మాట తోనే మాటలు మొదలవుతున్నాయి.
మన పక్కనే ఉన్న తమిళ సినిమా హీరోలు, దర్శకులు కూడా తమ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో కానీ సీక్వెల్ లో చేయడానికి కానీ ప్రేరణ, ధైర్యం ఇచ్చింది ఒక్క రాజమౌళి అనే చెప్తూ ఉంటారు. ఇలానే రీసెంట్ గా తమిళ సినిమా నుంచి వచ్చిన "కంగువా" కి కూడా హీరో సూర్య ఆ సినిమా నిర్మాతలు , దర్శకులు సైతం తమ సినిమా పాన్ ఇండియా లెవెల్లో చెయ్యడానికి కారణం రాజమౌళి అనే చెప్పారు.
అంతెందుకు తమిళ్ సినిమా నుంచి దిగ్గజ దర్శకుడు మణిరత్నం కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమాలు చేయడానికి కూడా ప్రేరణ రాజమౌళి అని తెలిపారు. ఇలా తమిళ్ నుంచే కాదు కన్నడ నుంచి కూడా కేజీఎఫ్ లాంటి చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రావడానికి అలాగే సీక్వెల్స్ కి కూడా జక్కన్నే కారణం అని క్రెడిట్ ఇస్తున్నారు.

అయితే జక్కన్న బ్రాండ్ లేకుండా పాన్ ఇండియా లెవెల్లో రీసెంట్ గా "పుష్ప" వెళ్ళింది . ఇది కూడా ఎలాంటి రాజమౌళి బ్రాండ్ లేకుండా అనుకుంటే తీరా ఈ సినిమాకి కూడా జక్కన్నకే మేకర్స్ క్రెడిట్ ఇవ్వడం ఇపుడు వైరల్ గా మారింది. తాజాగా పుష్ప 2 దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ..
అసలు పుష్ప సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చెయ్యాలని సలహా ఇచ్చిందే రాజమౌళి అని చెప్పడంతో వైరల్ అయ్యింది. దీనిని బట్టి ఇపుడు పుష్ప సినిమాలకి కూడా కారణం జక్కన్నే అని తేలిపోయింది. ఇలా పాన్ ఇండియా సినిమాలు మన నుంచి వస్తే ఖచ్చితంగా దానికి పరోక్షంగా రాజమౌళి పేరు వినిపిస్తూనే వస్తుంది అని చెప్పాలి. మరి రాజమౌళి కానీ పుష్ప మేకర్స్‌ని ఆరోజున పుష్ చేయకుండా ఉండి ఉంటే పుష్ప అనే సినిమా పరిస్థితి ఇంకోలా ఉండేది ఏమో.


Click it and Unblock the Notifications











