సీక్రెట్ గా నిహారిక, అఖిల్.. షాకిచ్చిన రాజమౌళి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు బిగ్ సినిమా ఫ్యామిలీస్ లో మెగా కుటుంబం అలాగే అక్కినేని కుటుంబంల కోసం అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ లో మొత్తం నాలుగు టాప్ ఫ్యామిలీస్ ఉంటే వాటిలో ఏ కుటుంబపు హీరో కానీ మరో హీరోతో కలిసి బిగ్ స్క్రీన్ ని షేర్ చేసుకోవడం వంటివి అభిమానులకి ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. ఇలా టాలీవుడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ కలయిక జరిగింది.
అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాటర్ నిహారిక కొణిదెల అలాగే అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ అక్కినేని కాంబినేషన్ పడింది. అయితే ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ పై గత కొన్ని పలు ఆసక్తికర వార్తలే వైరల్ గా మారాయి. కాగా ఇద్దరూ ఓ సినిమా చేయనున్నారు అని ఇద్దరి నడుమ మంచి రొమాంటిక్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయి అంటూ క్రేజీ రూమర్స్ వచ్చాయి. ఐతే అసలు ఈ స్పెషల్ కాంబినేషన్ పై నిజం బయటకి వచ్చింది.

ఈ కాంబినేషన్ కి జక్కన్న రాజమౌళికి ఉన్న లింక్ ఏంటో కూడా రివీల్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న వార్తలు నిహారిక, అఖిల్ కలిసి నటించనున్నారు అనే వార్తల్లో ఎలాంటి లేదట. ఎందుకంటే ఆల్రెడీ వారిద్దరూ కలిసి నటించడం ఎప్పుడో జరిగిపోయింది. అది కూడా సినిమా కోసం కాదు ఒక షార్ట్ ఫిలిం వీరిద్దరూ చేశారట. దీనిని ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ దర్శకత్వం వహించడం జరిగిందట.
మరి అసలు ఈ షార్ట్ ఫిలిం ఏమయ్యిందో కూడా రివీల్ అయ్యింది. మెగా డాటర్ నిహారిక ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ అఖిల్ నేను నటించిన షార్ట్ ఫిలిం రిలీజ్ ఆగిపోయింది అని తెలిపింది. తాము నటించిన ఆ చిట్టి చిత్రం మొత్తం అవుట్ పుట్ చూసి రాజమౌళి గారు రిలీజ్ ఆపెయ్యమని చెప్పారట. అనుకున్న రేంజ్ లో అవుట్ పుట్ రాలేదు కనుకే జక్కన్న షార్ట్ ఫిలిం ని రిలీజ్ చెయ్యొద్దని కార్తికేయకి చెప్పారట.
సో అలా ఈ ఆసక్తికర కాంబినేషన్ లో షార్ట్ ఫిలిం రిలీజ్ ఆగిపోయిందట. మరి ఈ ఇద్దర్ని కలిపి కార్తికేయ ఎలాంటి కాన్సెప్ట్ అనుకున్నాడో ఎలాంటి సీన్స్ చేసాడో అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఇక నిహారిక ప్రస్తుతం తాను ప్రొడ్యూస్ చేసిన చిత్రం "కమిటీ కుర్రోళ్ళు" థియేటర్స్ లో ఈ శుక్రవారం రిలీజ్ కి రాబోతుంది.
ఇక నెక్స్ట్ అఖిల్ అక్కినేని తదుపరి సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో పాటుగా తన అవైటెడ్ సినిమా "ఏజెంట్" ఓటిటి రిలీజ్ పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇక నెక్స్ట్ సినిమా అయితే యూవీ క్రియేషన్స్ లో అది కూడా 100 కోట్లకి పైగా బడ్జెట్ తో తాను సినిమా చేయనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా దాదాపు కొత్త దర్శకుడితో స్టార్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











