‘సాహో’ రిలీజ్ వేళ రాజమౌళి తప్పని పరిస్థితిలో దూరంగా..
ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ యాక్షన్ చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకత్వంలో రూ. 350 కోట్ల బడ్జెట్ ఖర్చుతో యువి క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్ద సినిమా కావడంతో ప్రభాస్‌తో పాటు నిర్మాతలు ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలో రాజమౌళి లాంటి మాస్టర్ మైండ్ తనకు తోడుగా ఉండాలని ప్రభాస్ కోరుకోవడం సహజం. అయితే అనుకోకుండా సాహో రిలీజ్ వేళ రాజమౌళి ఇక్కడ ఉండటం లేదు.
రాజమౌళి తన తాజా చిత్రం 'RRR' మూవీ షూటింగ్ కోసం యూరఫ్ వెళ్లారు. మళ్లీ వచ్చే నెల తిరిగి హైదరాబాద్ వస్తారు. యూరఫ్‌లోని బల్గేరియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై కొన్ని కీలకమైన సీన్ల చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

'సాహో' పెద్ద ప్రాజెక్టు కావడంతో ముందు నుంచీ ప్రభాస్ అండ్ టీమ్ రాజమౌళి సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. ఎడిటింగ్ రూములోనే జక్కన్న ఈ సినిమాను ఇప్పటికే చూశారట. కొన్ని మార్పులు కూడా సూచించినట్లు తెలుస్తోంది.
ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











