For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rajamouliకి అస్వస్థత.. ముందు ప్రకటన చేయడంతోనే అలా బయటకు.. సన్నిహితుల ద్వారా బయటకు!

  |

  దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి సంబంధించిన రెండు బడా హీరోల కుటుంబాల హీరోలు ఈ సినిమా చేయడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ కుటుంబం నుంచి ఆయన కుమారుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే రాజమౌళి అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  భారీ అంచనాలు

  భారీ అంచనాలు

  బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళి చాలా గ్యాప్ తీసుకుని ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్లుగా అజయ్ దేవగన్, సముద్రకని, శ్రేయ లాంటి ఇతర కీలక నటీనటుల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

  సినిమా మీద ఆసక్తి

  సినిమా మీద ఆసక్తి

  డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డి.వి.వి.దానయ్య 400 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల తో పాటు మరో అయిదు విదేశీ భాషల్లో కూడా విడుదల అవుతున్న ఈ సినిమా సంక్రాంతి టార్గెట్ గా జనవరి 7న బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ వేడి పెంచేశారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన కొన్ని పోస్టర్లు పాటలు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి.

  టికెట్ల రేట్లు పెంచడం లేదు

  టికెట్ల రేట్లు పెంచడం లేదు

  నవంబర్ 26వ తేదీన ఈ సినిమా నుంచి జనని అనే ఒక పాట విడుదల చేస్తామని గతంలో రాజమౌళి ప్రకటించారు. అయితే ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఒకరోజు ముందు మీడియా వ్యక్తులకు స్పెషల్ స్క్రీనింగ్ వేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిందో లేదో అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచడం లేదు అనే వార్త కూడా బయటకు వచ్చింది.

  స్పెషల్ స్క్రీనింగ్ కి

  స్పెషల్ స్క్రీనింగ్ కి

  ఈ విషయం మీద టాలీవుడ్ అంతా ఇప్పుడు టెన్షన్ కి గురి అవుతున్న నేపథ్యంలో స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి చాలా డల్ గా కనిపించారు. ఈ టికెట్ రేట్లు తగ్గించి అమ్మితే రికార్డుల పరంగా ఆర్ఆర్ఆర్ సినిమా అనేక కష్టాలు పడే అవకాశం ఉందని ఆ టెన్షన్ తో రాజమౌళి డల్ గా కనిపించారు అని వార్తలు బయటకు వచ్చాయి.

  జ్వరంతో బాధపడుతూ కూడా

  జ్వరంతో బాధపడుతూ కూడా

  అయితే తాజాగా ఈ విషయం మీద రాజమౌళి సన్నిహితుల నుంచి కీలక వివరాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా రాజమౌళి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని కానీ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని ఉద్దేశంతో ఆయన జ్వరంతో బాధపడుతూ కూడా ప్రెస్ ప్రీమియర్ హాజరయ్యారని వెల్లడించారు.

   అపవాదు తొలగించుకోవడానికి

  అపవాదు తొలగించుకోవడానికి

  సాధారణంగా రాజమౌళి సినిమాలు, అన్నా ఆయన ఇచ్చే అప్డేట్స్ అన్నా కూడా అభిమానులకు కచ్చితంగా లేట్ అవుతుందనే నమ్మకం ఉంటుంది. అపవాదు తొలగించుకోవడానికి చెప్పిన సమయం కంటే ముందే పాటలు పోస్టర్లు రిలీజ్ చేయడానికి అనేక తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. జనవరి 7వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  Recommended Video

  Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Filmibeat Telugu
  వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ

  వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ

  రాజమౌళి మూడు రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, దాంతో చాలా బలహీనంగా ఉన్నారని తెలుస్తోంది. "జనని పాటను ముందుగా తెలుగు మీడియాకు చూపించాలనుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, ఒత్తిడికి గురికావడం లేదా ఏదైనా చేయడం లాంటివి ఏమీ లేవు'' అని వారు స్పష్టం చేశారు.

  English summary
  Rajamouli is suffering From Viral Fever
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X