ఎన్టీఆర్, రాంచరణ్ కోసం సిట్టింగ్ మొదలు పెట్టిన రాజమౌళి!
రాజమౌళి బాహుబలి చిత్రంతో చరిత్ర సృష్టించాడు. రాంచరణ్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి అందరి దృష్టి ఈ భారీ ప్రాజెక్ట్ పై పడింది. తెలుగురాష్ట్రాల అభిమానులు రాంచరణ్, ఎన్టీఆర్ కలసి ఎప్పుడు నటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కొత్త చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని దేశవ్యాప్తంగా సినీవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రారంభించిన రాజమౌళి.. తాజగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. కీరవాణితో కలసి ఈ చిత్రానికి సంబందించిన సంగీత చర్చలు ప్రారంభించారట. డిసెంబర్ లోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని వార్తలు వస్తున్న సమయంలో త్వరలోనే అన్ని విషయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఇప్పటికే రాజమౌళి దర్శత్వంలో మూడు చిత్రాల్లో నటించాడు. రాంచరణ్ మగధీర చిత్రంలో నటించాడు. ఆర్ఆర్ఆర్ కథపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు నెలకొని ఉన్నాయి. వీటన్నింటికి చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావలసి ఉంది.


Click it and Unblock the Notifications











