For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైరల్ అవుతున్న రాజమౌళి - మహేష్ బాబు ఫ్యాన్ మెడ్ పోస్టర్.. ఇది అరాచకమే.. కానీ..?

  |

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకసారి ఆ మార్కెట్ వైపు వెళితే ఆ తరువాత సినిమాలను కూడా అదే తరహాలో దేశవ్యాప్తంగా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇప్పటికే వందకోట్ల మార్కెట్ కలిగిన హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండగా 200 కోట్లకు పైగా మార్కెట్ కలిగిన మహేష్ బాబు మాత్రం ఇంకా అటు వైపు వెళ్ల లేదు.

  ఇక రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుందని ఒక క్లారిటీ ఇవ్వగా.. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

   దేశవ్యాప్తంగా క్రేజ్..

  దేశవ్యాప్తంగా క్రేజ్..

  మహేష్ బాబు అంటే దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా మహేష్ బాబుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. హిందీ డబ్బింగ్ సినిమాలు కూడా యూట్యూబ్లో వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతర దర్శకులు మహేష్ బాబుతో హిందీ సినిమాలు తమిళ సినిమాలు చేయాలని అనుకున్నారు కానీ అప్పట్లో మహేష్ అటువైపు పెద్దగా ఫోకస్ చేయలేదు.

  మహేష్ కోసం రాజమౌళి..

  మహేష్ కోసం రాజమౌళి..

  మధ్యలో మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మహేష్ బాబు మళ్లీ అటువైపు వెళ్ళకుండా తెలుగులో ఎక్కువ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించాడు. కాని రాజమౌళి మాత్రం మహేష్ బాబును పాన్ ఇండియా రేంజ్ లో చూపించాలి అని ప్లాన్ వేసుకుంటున్నాడు. మొత్తానికి మహేష్ బాబు కోసం రాజమౌళి ఒక కథ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

  ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో..

  ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో..

  రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు కోసం కూడా అంతకుమించి అనేలా యాక్షన్ స్టోరీ రెడీ అవుతొంది అని.. అయితే ఆ సినిమా కథ పూర్తిగా ఆఫ్రికా నేపథ్యంలో ఉంటుందని సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ అని కూడా అన్నారు. అయితే రాజమౌళి మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో ఆ కథను ఓకే చేయలేదు అని అతను ఫిక్స్ అయితేనే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందని అన్నారు.

  ఫ్యాన్ మెడ్ పోస్టర్ వైరల్

  ఫ్యాన్ మెడ్ పోస్టర్ వైరల్

  ఇక సోషల్ మీడియాలో అయితే మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ కి సంబంధించిన అనేక రకాల విషయాలు వైరల్ గా మారుతున్నాయి. వీరి కలయికలో వచ్చే సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఉంటుంది అనగానే కొంతమంది ఎవరూ ఊహించని విధంగా పోస్టర్ల ను కూడా రెడీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ మెడ్ పోస్టర్ అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

  Pawan Pawan Fans Angry On SS Rajamouli Tweets | Filmibeat Telugu
  అలా అయితే ఉండదట..

  అలా అయితే ఉండదట..

  నిజానికి ఆ పోస్టర్ ఓ వర్గం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే రాజమౌళి ఆ తరహాలో మహేష్ బాబునీ చూపించే అవకాశం లేదని అంటున్నారు. ఆ సినిమా ఇండియానా జోన్స్ అనే తరహా లో ఉంటుంది అని చెబుతున్నారు. ఇక ఈ పోస్టర్ అయితే టార్జాన్ అనే తరహాలో ఉంది అని ఆ తరహాలో మహేష్ బాబు రాజమౌళి సినిమా చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు.

  మరి రాజమౌళి మహేష్ బాబును వెండితెరపై ఎలా చూపిస్తాడో తెలియాలి అంటే ఈ ఏడాది చివరి వరకు కాస్త ఆగాల్సిందే. RRR సినిమా రిలీజ్ అయిన తర్వాతనే రాజమౌళి మహేష్ బాబు సినిమాలు సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

  English summary
  Rajamouli mahesh babu project fan made poster viral in social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion