నచ్చితే నచ్చిందని మాత్రమే చెబుతా.. మొట్టమొదటి సారి ఈ మాట చెబుతున్నా.. రాజమౌళి!
ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే విభిన్నమైన చిత్రాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. ఆ కోవకు చెందిందే కేర్ ఆఫ్ కంచరపాళెం. రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా కథ, పాత్రలే బలాలుగా ఈ చిత్రం సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సినీ ప్రముఖులకు కంచరపాళెం చిత్ర ప్రివ్యూ షో ప్రదర్శించారు. సినీ ప్రముఖుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అగ్రదర్శకుడు రాజమౌళి ఈ చిత్రం గురించి స్పందించారు.

ఏదైనా చిత్రం చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతే, సినిమా చూసిన వారం రోజుల వరకు కూడా ఆ పాత్రలు మనల్ని వెంటాడుతుంటే ఆ చిత్ర ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అర్థం. కంచర పాళెం చిత్ర విషయంలో కూడా నాకు అలంటి అనుభూతే కలిగింది. సినిమా నచ్చితే నచ్చిందని మాత్రమే చెబుతాను. చూడమని రెకమండ్ చేయను. కానీ మొట్టమొదటి సారి చెబుతున్నా.. కేర్ ఆఫ్ కంచర పాళెం చిత్రం చూడండి అని రాజమౌళి తెలిపారు. రాజమౌళి మాట్లాడిన వీడియోని రానా ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











