ఫన్ మాత్రమే కాదు.. ఎమోషన్స్ కూడా: ఆకట్టుకుంటోన్న ‘గాలి సంపత్’ ట్రైలర్
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'గాలి సంపత్'. అనిష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. అంతేకాదు, అతడు దీనికి సహా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన లవ్‌లీ సింగ్ హీరోయిన్ నటించింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో 'గాలి సంపత్' ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఓ ప్రమాదంలో మాట కోల్పోయి.. గాలి మాత్రమే వదిలే ఓ వ్యక్తి కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ విషయాన్ని ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు. దానికి ఫన్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా యాడ్ చేశారు. ఇక, ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు పోటా పోటీగా నటించినట్లు కనిపిస్తోంది.

ఫస్టాఫ్ మొత్తం ఫన్నీగా సాగుతూ నవ్వించే ఈ సినిమా.. సెకెండాఫ్‌లో మాత్రం చాలా ఎమోషనల్ సీన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఎడిపించేదిగా ఉంటుందట. ట్రైలర్‌లోనూ అదే ఫార్ములాను చూపించారు. మరీ ముఖ్యంగా 30 అడుగుల నుయ్యిలో మాటలు రాని గాలి సంపత్ పడిపోతే దానిలో నుంచి ఎలా బయటకు వస్తాడు అనేది చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ట్రైలర్ చివర్లో రాజేంద్ర ప్రసాద్ బయటకు వచ్చే సీన్ చూపించారు. మొత్తానికి ఈ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











