twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRRలో చరణ్ డామినేషన్.. అసలు విషయం చెప్పిన రాజమౌళి.. లాజిక్ కరెక్టేగా!

    |

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన RRR సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ థియేటర్లో RRR హావానే కొనసాగుతుంది అంటే ఈ సినిమాకు జనాలు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను డామినేట్ చేశారు అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి స్పందించాడు. ఈ విషయం మీద ఆయన ఏం మాట్లాడారు? అనే వివరాల్లోకి వెళితే

    రౌద్రం రణం రుధిరం

    రౌద్రం రణం రుధిరం

    స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తారక్.. కొమురం భీంగా నటించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

    ఎన్టీఆర్ ను డామినేట్ చేశాడు

    ఎన్టీఆర్ ను డామినేట్ చేశాడు

    ఇక ఈ సినిమాలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామారాజుగా రామ్‌ చరణ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచి ఓ అంశంపై మాత్రం సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. అదేమిటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ను డామినేట్ చేశాడు అనే చర్చ. ఈ క్రమంలో ఇటీవల ముంబైలో జరిగిన సక్సెస్‌ మీట్‌లో దీనిపై చరణ్‌కు ఓ రిపోర్టర్‌ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.

    సరైనది కాదని

    సరైనది కాదని

    అయితే దీనికి చరణ్‌ 'ఒక్క క్షణం కూడా నేను అలా అనుకోను. డామినేషన్‌ అన్న పదాన్ని నేను నమ్మను కూడా. అందులో నిజం లేదు' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ అంశంపై రాజమౌళి స్పందించారు. ఇందులో ఎవరి డామినేషన్‌ లేదని.. తారక్‌, చరణ్‌లు ఇద్దరు తమ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని అన్నారు. ఇక 'చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అన్నమాట సరైనది కాదని ఎందుకంటే ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటుందని అన్నారు.

    ఒక్కసారి మాత్రమే సేవ్‌ చేశాడని

    ఒక్కసారి మాత్రమే సేవ్‌ చేశాడని

    క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం వల్ల.. అది చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకు చరణ్ డామినేషన్ ఉందినిపించవచ్చని అన్నారు. ఒక వేళ కొమురం భీముడో పాట దగ్గరే క్లైమాక్స్ ఉండుంటే అప్పుడు ఎన్‌టీఆర్ డామినేషన్ ఉన్నట్టు అనిపించేదని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో తారక్‌, చరణ్‌ను రెండుసార్లు రక్షించాడు కానీ చరణ్‌ మాత్రం తారక్‌ను ఒక్కసారి మాత్రమే సేవ్‌ చేశాడని అన్నారు.

    తారక్‌ డామినేషణ్‌

    తారక్‌ డామినేషణ్‌

    అంతేకాదు ఓ చోట చరణ్‌ '15 సంవత్సరాలుగా స్పష్టత లేని నా లక్ష్యానికి తారక్‌ దారి చూపించాడు. ఆయుధం ఒక్కటే ధైర్యం అనుకున్న నాకు అతడు ఎమోషన్‌ కూడా ఓ ఆయుధంగా చూపించాడని సముద్రఖనితో అంటూ ప్రశంసిస్తాడు.. అంటే ఇక్కడ తారక్‌ హీరో చరణ్‌ అతని ఫాలోవర్ అనుకోవచ్చు కదా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. అలాచూస్తే మీకు తారక్‌ డామినేషణ్‌ కూడా కనిపిస్తుంది'' అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

    English summary
    Rajamouli responds on ram charan's domination over ntr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X