వారణాసి స్టోరీ లీక్ చేసిన రాజమౌళి.. మహేశ్ సినిమాలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?

Rajamouli About Varanasi Story: వారణాసి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి విజయాల తర్వాత రాజమౌళి.. మహేష్ బాబుతో రూపొందిస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌తోనే అంతర్జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది.హాలీవుడ్ స్థాయి విజువల్స్, అడ్వెంచర్ అంశాలతో తెరకెక్కుతోందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ఇప్పటివరకు 'వారణాసి'ని భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చాలామంది భావించారు. కానీ రాజమౌళి మాత్రం ఈ కథకు ప్రాణం యాక్షన్ కాదు,తండ్రీ-కొడుకుల మధ్య సాగే భావోద్వేగం అని వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లొకేషన్లు, అద్భుతమైన విజువల్స్, ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులను చివరికి కదిలించేది కుటుంబ అనుబంధమేనని ఆయన స్పష్టం చేశారు.

Rajamouli Reveals Mahesh Babu s Varanasi Story

డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ..మీరు ఇప్పటివరకు చూసిన ట్రైలర్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. వారణాసి సినిమాలో ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని మంచు ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు, రామాయణంలోని పురాణ గాథాలు, దేవుళ్లు, ఒక ఫాంటసీ వర్డల్ అన్నీ కలిసిన ఒక విజువల్ జర్నీ ఉండబోతోంది. అంటే ఇది కేవలం ఒక దేశంలో సాగే కథ కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలోని ముఖ్య అంశం తండ్రికొడుకుల అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు అన్ని ఈ సినిమాలో మిళితమై ఉన్నాయని రాజమౌళి వెల్లడించారు.

ఇంతకుముందు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ వారణాసి సినిమా గురించి మాట్లాడుతూ కుంభకర్ణుడు-శ్రీరాముడి మధ్య యుద్ధానికి సంబంధించిన అంశాలు సినిమాలో ఉంటాయని హింట్ ఇచ్చారు. ఇప్పుడు రాజమౌళి కూడా రామాయణంలోని దేవుళ్లు, పురాణ అంశాలు ఉంటాయని చెప్పడంతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇది పూర్తిస్థాయి పురాణ కథగా కాకుండా, ఆధునిక అడ్వెంచర్ కథ గా తెరకెక్కిస్తున్నారట. ఇక తండ్రీ-కొడుకుల భావోద్వేగమే కథకు కేంద్రబిందువని రాజమౌళి చెప్పడంతో సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది.

మహేష్ బాబు తండ్రి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు విషయం తెలిసిందే. అయితే.. ఆయనే మహేష్ తండ్రి పాత్రలో కనిపించే అవకాశముందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మహేష్ బాబు ద్విపాత్రాభినయంలో రుద్రుడు, శ్రీరాముడి పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, . ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ 'శ్రీ దుర్గా ఆర్ట్స్' అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇక సినిమా షూటింగ్‌లో మెయిన్ యాక్షన్, భావోద్వేగ సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మొత్తం షూటింగ్‌ను 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read more about: Varanasi ss rajamouli mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X