twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: జపాన్ బాక్సాఫీస్ వద్ద RRR ప్రభంజనం.. 2 మిలియన్ మార్క్ దాటి ట్రెండింగ్ లో మూవీ

    |

    యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటిసారి కలిసి నటించిన భారీ మల్టీ స్టారర్ చిత్రం RRR. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించి ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటిటి ద్వారా ఈ సినిమాకు విదేశాల్లో కూడా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక జపాన్లో కూడా ఇటీవల సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. అక్కడ డైరెక్టర్ రాజమౌళి, తారక్ అండ్ చెర్రీ కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేశారు. తాజగా జపాన్ లో అత్యధిక ఆక్యుపెన్సీతో రికార్డ్ క్రియేట్ చేసింది RRR.

    హాట్ టాపిక్ గా ప్రమోషన్స్...

    హాట్ టాపిక్ గా ప్రమోషన్స్...

    దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన చిత్రం RRR దేశవ్యాప్తంగా ఎంతటి సక్సెస్ సాధించిందో చెప్పనవసరం లేదు. ఇక జపాన్ లో ఈసినిమా ఊహించినట్లుగానే చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రాజమౌళి అక్కడ కూడా రెగ్యులర్ సినిమాల తరహాలో ప్రమోషన్స్ చేయడం విశేషం. అందుకోసం ప్రత్యేకంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లడం హాట్ టాపిక్ గా నిలిచింది. వారి ఫ్యామిలీ కూడా అక్కడ ఆడియన్స్ ని ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. జపనీస్ భాషలో తారక్ మాట్లాడి జపనీయుల మనసు దోచుకున్నాడు.

    టాప్ 10లో RRR మూవీ..

    టాప్ 10లో RRR మూవీ..

    ఇక జపాన్ లో RRR సినిమా మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే జపాన్ లో RRR సినిమా వారం వారానికి తన పరిధి పెంచుకుంటూ పోతోంది. ఈ వారాంతంలో జపాన్ బాక్సాఫీస్ వద్ద RRR సినిమా 10వ స్థానంలో ట్రెండ్ అవుతూ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా ఎంతో నిలకడగా ప్రదర్శించబడుతోంది ఈ సినిమా. గత వారం కలెక్షన్స్ కంటే ఈ వారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే RRR మూవీ లాంగ్ రన్ కొనసాగిస్తూ దూసుకుపోతుందన్నమాట.

    124.4 శాతంగా పెరిగిన ఆక్యుపెన్సీ..

    జపాన్ బాక్సాఫీస్ వద్ద RRR సినిమా 2 మిలియన్న మార్క్ ను అధిగమించి సత్తా చాటుతోంది. అలాగే ఈ వారం కేవలం శుక్రవారం నుంచి ఆదివారం మధ్య గత వారంతో పోల్చుకుంటే 124.4 శాతం ఎక్కువగా ఆక్యుపెన్సీ నమోదు అయింది. గతం వారం 9057 మంది చూడగా ఈవారం ఏకంగా 24889 మంది RRR సినిమాను వీక్షించారు. అలాగే వంద ఐమాక్స్ స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారట. అంతకుముందు వారం 50 ఐమాక్స్ స్క్రీన్లలో షో రన్ చేశారని సమాచారం. ఇక RRR జపాన్ బాక్సాఫీస్ 31 రోజుల కలెక్షన్స్ 280 మిలియన్ యేన్స్ సాధించినట్లు టాక్.

    English summary
    SS Rajamouli Directed Movie RRR Crossed 2 Million Mark And Trending In 10th Place. And Occupancy Increased To 124.4%
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X