Don't Miss!
- Automobiles
కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!
- Finance
ఇండియాకు మెట్రో గుడ్‌బై? కొనుగోలుకు అమెజాన్, డీమార్ట్, రిలయన్స్ పోటీ?
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రాజమౌళి లవ్ స్టోరీ ప్లాన్.. గాలి తీసేసిన రమా.. హార్ట్ బ్రేకింగ్ అనిపించడంతో RRR ప్లాన్!
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సహా నిర్మాత DVV దానయ్య ప్రొడక్షన్ లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక RRRని ప్రమోట్ చేస్తున్నారు, ఈ సినిమా 7 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను ఈ చిత్రం బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల మీడియాతో అసలు ఈ సినిమా ఎలా రూపుదిద్దుకుంది ? అనే విషయం గురించి రాజమౌళి కీలక వివరాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

వాయిదా
2018లో ఎనౌన్స్ చేసిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయి విడుదల కూడా అవ్వాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఎంటర్ అయిన కరోనా కారణంగా ఈ సినిమా అంతకంతకీ వెనక్కి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్టోబర్ 13వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన సినిమా యూనిట్ బాగానే కష్టపడింది. అయితే అనుకోకుండా వచ్చి పడిన కరోనా మహమ్మారి రెండో దశ కారణంగా ఆ ఆశలను కూడా వమ్ము కావడంతో జనవరి 7న విడుదల చేయడానికి ఫిక్స్ అయింది.

జనవరి 7, 2022న ‘
రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ 'RRR' సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలోనే కాక మరో ఐదు విదేశీ బాషలలో కూడా రిలీజ్ అవుతోంది. జనవరి 7, 2022న 'RRR' విడుదల అవుతూ ఉండగా ఈ సినిమా మీద ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.

లవ్ స్టోరీ అనుకుని
మగధీర దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ''బాహుబలి 2: ది కన్‌క్లూజన్ విడుదల తర్వాత ఇద్దరు మేల్ సూపర్‌స్టార్లు, ఒక హీరోయిన్ తో కలిసి లవ్‌స్టోరీని తెరకెక్కించాలని ప్లాన్ చేశాను. దీని గురించి నేను తారక్ మరియు చరణ్ ఇద్దరితో చర్చించాను మరియు మేమంతా ఈ సినిమా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు.

ప్రేమ కథను ఎవరు చూస్తారు?
అయితే నేను ఇదే విషయాన్ని నా భార్య రమతో పంచుకున్నప్పుడు, ఆమె స్పందిస్తూ, 'మీ నుండి వచ్చే ప్రేమ కథను ఎవరు చూస్తారు?' అని అడిగిందని నిజంగా అది హృదయ విదారకంగా అనిపించిందని అన్నారు. రాజమౌళి చెబుతూ అప్పుడు "తర్వాత ఇద్దరు నిజ జీవితంలో హీరోల కల్పిత కథ ఆధారంగా సినిమా తీయాలని అనుకున్నానని అన్నారు.

సరైన మార్గంలో ఉన్నానని
అలా అనుకున్నప్పుడు నేను భావోద్వేగ ఉత్సాహాన్ని అనుభవించానని రాజమౌళి అన్నారు. తారక్, చరణ్‌లకు కూడా ప్రేమకథ కంటే ఇది బాగా నచ్చిందని ఆయన అన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, నా కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ నేను సరైన మార్గంలో ఉన్నానని నిర్ధారిస్తారని అన్నారు.