twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rajamouli's RRR : మొత్తం పది భాషల్లో .. రికార్డ్ బ్రేకింగ్ ధరకి డిజిటల్, శాటిలైట్ రైట్స్.. పూర్తి లిస్ట్ ఇదే!

    |

    దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలోనే కాక మరో ఐదు విదేశీ బాషలలో కూడా రిలీజ్ అవుతోంది. ఆ విషయం కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే

    తెలుగు సినిమా సత్తా

    తెలుగు సినిమా సత్తా

    తెలుగు సినిమా సత్తాను కేవలం భారతదేశానికి మాత్రమే కాక ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన సినిమా ఏదయినా ఉంటే అది బాహుబలి అని చెప్పక తప్పదు. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2400 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి అప్పట్లో బద్దలు కొత్త లేని రికార్డుగా నిలిచింది. అంతే కాక పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అయి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.

    రౌద్రం ర‌ణం రుధిరం

    రౌద్రం ర‌ణం రుధిరం

    బాహుబలి క్రేజ్ తో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా ఉండడంతో రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి టాలీవుడ్ టాప్‌ హీరోలయిన ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అక్టోబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'ను విడుద‌ల చేస్తామని ఈ మధ్య ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా క్లారిటీ ఇచ్చారు.

    ముందు కొనుక్కున పెన్ స్టూడియోస్

    ముందు కొనుక్కున పెన్ స్టూడియోస్

    నిజానికి ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ సంస్థ పెన్ స్టూడియోస్ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. జయంతి లాల్ గడ ఆధ్వర్యంలోని పెన్ స్టూడియోస్ సంస్థ 'ఆర్.ఆర్.ఆర్' నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా అన్ని భాషల్లో ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులు తీసుకున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ అప్పట్లో వెల్లడించింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు వాటిని ఏరియాల వారీగా, బాషల వారీగా పెన్ స్టూడియోస్ సంస్థ అమ్మేసింది.

    మొత్తం పది బాషలలో రిలీజ్

    కొద్దిసేపటి క్రితం పెన్ స్టూడియోస్ సంస్థ అధికారికంగా ప్రకటించిన వివరాల మేరకు ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లోనే కాక మరో అయిదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది.. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, స్పానిష్, టర్కిష్ భాషలలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.. దానికి సంబంధించిన డిజిటల్ హక్కులు ఎవరెవరు పొందారు అనే అంశాన్ని కూడా పెన్ స్టూడియోస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

    ఏయే ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయంటే

    ఏయే ఓటీటీ సంస్థలు దక్కించుకున్నాయంటే

    ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జి5 సంస్థ సాధించగా హిందీ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం నెట్ ఫ్లిక్స్ సంస్థ సాధించింది. ఇక అలాగే మిగతా అయిదు విదేశీ భాషలను కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమ్ చేయనుంది. ఇక శాటిలైట్ విషయానికి వస్తే హిందీ వర్షన్ సినిమాను జీ సినిమాస్ టెలికాస్ట్ చేయనుంది. అలాగే తెలుగు, తమిళ, కన్నడ వర్షన్స్ ను మాత్రం స్టార్ సంస్థ దక్కించుకుంది. ఇక మలయాళం విషయానికి వస్తే ఏషియానెట్ సంస్థ ఈ సినిమా హక్కులు సాధించింది.

    దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా

    దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా

    మొత్తం ఈ పది భాషలలో ఈ శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి పెన్ స్టూడియోస్ సంస్థ అమ్మినట్లు తెలుస్తోంది. భారతదేశ సినిమా చరిత్రలోనే ఇది ఒక భారీ మొత్తానికి అమ్ముడుపోయిన సినిమాగా రికార్డుల్లోకెక్కిన్నట్లు ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు..ఇక సినిమా రిలీజ్ అయిన 70 నుంచి 100 రోజుల తర్వాత మాత్రమే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు.

    English summary
    As we all know Jayantilal Gada of pen studios has bagged the satellite and digital rights of SS Rajamouli’s RRR. The producer had got the satellite, digital rights and electronic for all languages – Telugu, Tamil, Kannada, Malayalam and Hindi. Now pen studios announced all their partenrs for streaming.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X