RRR సెన్సార్ రివ్యూ.. సెన్సార్ సభ్యుల రియాక్షన్ ఏంటో తెలుసా? మరో గుడ్ న్యూస్ కూడా!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రధారులుగా నటించిన ఈ సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు ఆ మధ్య విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో వాయిదా వేశారు మేకర్స్. ఇక ఫైనల్ గా మార్చి 25 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తయింది. ఆ వివరాలు

మార్చి 25 న
సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి స్వరాలందించారు. కొవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

U/A సర్టిఫికేట్
తాజాగా RRR సినిమాకు సంబందించిన ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా సెన్సార్ ప్రక్రియను కంప్లీట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ కూడా జారీ అయింది. RRR సెన్సార్ పూర్తయింది. RRR సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లుగా నిర్ణయించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు స్టన్ అయ్యారు అని తెలుస్తోంది.

ఫుల్ ఖుషి
నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ సంధు ఆర్ఆర్ఆర్ సెన్సార్ రివ్యూను తన ట్విట్టర్ ఖాతా ద్వారా జనవరిలోనే పోస్ట్ చేసారు. "మైండ్ బ్లోయింగ్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ .... ఇద్దరూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు .. " అంటూ ఫైర్ ఎమోజీని షేర్ చేశారు. దంగల్, బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ధర పెంచుకోవడానికి
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి 75 రూపాయల సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ గురువారం నాడు జీవో రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం..పది రోజుల పాటు ధర పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇటీవల ఇచ్చిన జీవో ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్సుల్లో హయ్యెస్ట్ టికెట్ రేటు 250 ఉంది..దానికి ఇప్పుడు పెంచిన 75 కలుపుకుని 325 రూపాయల వరకు టికెట్ ధర పెంచుకోవచ్చు.. రాజమౌళి లెక్కలు సమర్పించాక పరిశీలించి 75 రూపాయల టికెట్ ధర పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం.

12 ఏళ్ల క్రితం
ఇక ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ప్రకారం హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా..336 కోట్లు ఖర్చయినట్లు ఇటీవల ప్రభుత్వానికి తెలిపింది మూవీ టీమ్. హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్‌తో కలిపి అది 478 కోట్ల రూపాయలని తెలిపింది. వచ్చిన లాభాల్లో దర్శకుడు , ప్రొడ్యూసర్ చెరిసగం తీసుకోనున్నారట. అంతేకాదు ఈ సినిమా చేయడం కోసం 12 ఏళ్ల క్రితం డైరెక్టర్ రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చారట ప్రొడ్యూసర్.


Click it and Unblock the Notifications











