RRR షాక్.. ఆరోజు రిలీజ్ చేయడం లేదు.. కొత్త రిలీజ్ డేట్ గురించి కొత్త అనుమానాలు!

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలో కాక మరో ఐదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. అయితే రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనగా ఇప్పుడు సినిమా యూనిట్ దాని మీద క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

 బాహుబలి క్రేజ్

బాహుబలి క్రేజ్

తెలుగు సినిమా సత్తాను కేవలం భారతదేశానికి మాత్రమే కాక ప్ర‌పంచానికి చాటి చెప్పిన బాహుబలి తరువాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2400 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీకి భారీ రికార్డుగా నిలిచింది. అంతే కాక పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అయి తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పి తెలుగు వాడు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిం

భారీ అంచనాలు

భారీ అంచనాలు

బాహుబలి క్రేజ్ తో పాటు హాలీవుడ్ మొదలు బాలీవుడ్ దాకా అనేక మంది నటీనటులు ఈ సినిమాలో భాగం కావడంతో ఆర్ఆర్ఆర్ కోసం అన్ని బాషల ప్రేక్షకులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి టాలీవుడ్ టాప్‌ హీరోలయిన ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ ల‌తో దాదాపు మూడు నాలుగు బాషల నటులను సినిమా కోసం ఎంపిక చేసి మరీ సినిమాను రూపొందిస్తున్నారు.

ముందు అక్టోబర్ లో

ముందు అక్టోబర్ లో

అక్టోబ‌ర్ 13న ప్రపంచ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్'ను విడుద‌ల చేస్తామని ఈ మధ్య ఎన్టీఆర్ పుట్టినరోజు రిలీజ్ చేసిన పోస్టర్ సహా అన్ని పోస్టర్స్ లో కూడా పేర్కొన్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ దాటికి షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో సినిమా అక్టోబర్ నెల 13వ తేదీన రిలీజ్ కావడం అనేది దాదాపు అసాధ్యం అనే ప్రచారం అయితే జరిగింది. రౌద్రం ర‌ణం రుధిరం పేరుతొ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది.

అధికారిక ప్రకటన

అధికారిక ప్రకటన

ఇక ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 21 నాటికి #RRRMovie రిలీజ్ చేయడానికి పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది, కానీ చాలా మందికి తెలిసినట్లుగా, మేము విడుదలను వాయిదా వేస్తున్నాము కానీ థియేటర్లు నిరవధికంగా మూసివేయబడిన కారణంగా కొత్త తేదీని ప్రకటించలేమని పేర్కొంది. ప్రపంచ సినిమా మార్కెట్లు ప్రారంభమైనప్పుడు మేము సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది.

 కొత్త రిలీజ్ డేట్

కొత్త రిలీజ్ డేట్

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం ఒక కొత్త రిలీజ్ డేట్ రాజమౌళి ఫిక్స్ చేశారని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుతున్న సమాచారం మేరకు సంక్రాంతి రేసులో దిగాలని చూసిన ఆర్ఆర్ఆర్ టీమ్ అనేక ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 2022 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు అని కూడా ప్రచారం జరుగుతూ ఉండగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X