RRR : ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అనివార్య కారణాలు లేకుండా ఈసారైనా వస్తుందా?
బాహుబలి 2 పూర్తయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తున్నారు. మొన్నీమధ్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. జనవరి 7న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

కరోనా ఎఫెక్ట్ తో
2018లో ఎనౌన్స్ చేసిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయి విడుదల కూడా అవ్వాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కరోనా కారణంగా ఈ సినిమా అంతకంతకీ వెనక్కి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్టోబర్ 13వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన సినిమా యూనిట్ బాగానే కష్టపడింది. అయితే అనుకోకుండా వచ్చి పడిన కరోనా మహమ్మారి రెండో దశ ఆ ఆశలను కూడా వమ్ము చేయడంతో జనవరి 7న విడుదల చేయడానికి ఫిక్స్ అయింది.

జనవరి 7, 2022న ‘
రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలోనే కాక మరో ఐదు విదేశీ బాషలలో కూడా రిలీజ్ అవుతోంది. జనవరి 7, 2022న 'RRR' విడుదల అవుతూ ఉండగా ఈ సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది.

పది భాషల్లో
బాహుబలి క్రేజ్ తో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా ఉండడంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి టాలీవుడ్ టాప్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న క్రమంలో సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లోనే కాక మరో అయిదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియా, స్పానిష్, టర్కిష్ భాషలలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

భారీ అంచనాలు
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ కనిపించనుంది. అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

డిసెంబర్ 9న
ఇక ఈ సినిమాకి ప్రమోషన్స్ వేగవంతం చేయగా ఆర్‌ఆర్‌ఆర్‌సోల్ ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా సినిమా థియేటరికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించారు. కానీ అదే సమయానికి సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో ట్రైలర్ రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 9న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో? సినిమా మీద ఎంత ఆసక్తి పెంచుతుందో? చూడాలి మరి.


Click it and Unblock the Notifications











