»   » ఆర్ఆర్ఆర్ : ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ ఫిక్స్ చేసిన రాజమౌళి!

ఆర్ఆర్ఆర్ : ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్పాట్ ఫిక్స్ చేసిన రాజమౌళి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో త్వరలో #ఆర్ఆర్ఆర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

    సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ డార్జిలింగ్‌లో ప్లాన్ చేస్తున్నారట. అక్కడ సినిమా షూటింగ్ కోసం ప్రభుత్వ అనుమతి కోసం చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట.

    ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ నుండి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు, సెట్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. బాహుబలి సినిమాకు పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు.

    Rajamouli’s RRR will shot in Darjeeling

    రాజమౌళి ఏదైనా సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్లానింగ్ భారీగా ఉంటుంది. తను తీయబోయే సినిమా బడ్జెట్‌కు తగిన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటారు. అలా పర్ఫెక్టుగా ప్లానింగ్ చేశారు కాబట్టే బాహుబలి వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. 'ఆర్ఆర్ఆర్' విషయంలోనూ రాజమౌళి అలాంటి ప్లానింగే చేస్తున్నారట.

    రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్లు డీవీవీ దానయ్య ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా కాన్సెప్టు ఏమిటి? అనే విషయాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.

    English summary
    The pre-production of Rajamouli’s new film with NTR and Ram Charan is going on in full swing and the latest we hear is that a major schedule of the film will be shot in Darjeeling.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more