Oscar 2023: RRR గెలుపులో రాజమౌళి కుమారుడి కృషి.. కీరవాణి అతనికి థాంక్స్ ఎందుకు చెప్పాడంటే..
RRR సినిమా నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఓపెన్ కేటగిరీలో ఆస్కార్ పోటీలకి వెళ్ళిన ఈ సాంగ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డుని కూడా గెలవడం ద్వారా.. ఇండియా నుంచి మొదటి సారిగా ఆస్కార్ అవార్డులకి వెళ్లి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డుని సొంతం చేసుకున్న చిత్రంగా RRR మూవీ నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ అవార్డుని అందుకున్న సందర్భంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కార్తికేయకి థాంక్స్ చెప్పారు. రాజమౌళికి కృతజ్ఞతలు చెబుతూనే ఇంత వరకు రావడానికి కారణం అయిన కార్తికేయకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడం విశేషం. ఈ సినిమాకి సెకండ్ యూనిట్ దర్శకుడిగా కార్తికేయ పని చేశాడు. అంతమాత్రానికే థాంక్స్ చెప్పాలా అంటే దానికి వేరే కారణం ఉందని చెప్పాలి. అయితే ఇండియా నుంచి ఆస్కార్ కి నామినేట్ కాని RRR మూవీని ఇండిపెండెంట్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ పంపించడంలో కార్తికేయ చాలా కీలక పాత్ర పోషించాడని తెలుస్తుంది.

అదే సమయంలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాని ప్రమోట్ చేయడంలో, అలాగే అమెరికాలో కూడా ఎక్కువ మందికి రీచ్ చేయడం కోసం కార్తికేయ చాలా వర్క్ చేసినట్లు టాక్. RRR ని గ్లోబల్ లెవల్ కి తీసుకొని వెళ్ళడం కోసం చాలా స్ట్రాంగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ ని కార్తికేయ నిర్వహించాడు. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంలో, ఇప్పుడు ఆస్కార్ అవార్డుని అందుకోవడంలో కూడా కార్తికేయ పాత్ర చాలా కీలకంగా ఉందని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఎంఎం కీరవాణి ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి తండ్రి ఒక గొప్ప సినిమా చేసి కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కొడితే.. ఇప్పుడు ఆ సినిమాని గ్లోబల్ మార్కెట్ లోకి తీసుకెళ్ళి తనయుడు అవార్డు వచ్చేలా చేశాడు. అలాగే తండ్రి గురించి అందరూ గర్వంగా చెప్పుకోవడంలో కూడా కార్తికేయ చేసిన కృషి ఎంతగానో ఉంది.


Click it and Unblock the Notifications











