Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్ని మారినా రాజమౌళి మాత్రం మారడం లేదు.. RRRకు మరో కొత్త టెన్షన్!
టాలీవుడ్ అగ్ర దర్శకుడు అనే పోస్ట్ నుంచి పాన్ ఇండియా బెస్ట్ డైరెక్టర్ అనే వరకు గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఎట్రాక్ట్ అవుతారని చెప్పవచ్చు. మొదటి సినిమా నుంచి జక్కన్న ఆలోచిస్తున్న తీరు అప్‌గ్రేడ్ అయినా కూడా ఒక విషయంలో మాత్రం ఆయన మారలేదని స్పష్టంగా అర్థమవుతున్నట్లు టాక్ వస్తోంది. RRR విషయంలో ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కొన్ని స్టోరీలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఊహించని విధంగా బిగ్ ప్రాజెక్ట్
బాహుబలి లాంటి సినిమా తీసిన జక్కన్న ఆ తరువాత ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయం అప్పట్లో అభిమానులను చాలా కన్ఫ్యూజన్ కి గురి చేసింది. తప్పకుండా ఏదైనా చిన్న సినిమానే చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలను లైన్ లో పెట్టి RRR కథతో షూటింగ్ స్టార్ట్ చూశాడు. ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
మరింత పెరిగిన బడ్జెట్
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మొదట దర్శకుడు వేసుకున్న ప్లాన్ కి కరోనా దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ విషయంలో మార్పులు చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు జక్కన్న ఆలస్యం చేస్తున్న విధానానికి బడ్జెట్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఇలానే కొనసాగితే..
సీన్స్ విషయంలో జక్కన్న అంత ఈజీగా కాంప్రమైజ్ కాడని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒక్క షాట్ కోసం దాదాపు నాలుగైదు గంటల సమయం తీసుకుంటునట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ తో పూర్తి చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇదే తరహాలో కొనసాగితే ఏప్రిల్ వరకు కూడా షూటింగ్ ఎండ్ అవ్వదట.
ఏదేమైనా..వెనక్కి తగ్గేలా లేడు
ఆలస్యం కావడమే కాకుండా, బడ్జెట్ కూడా అంతకంతకు ఎక్కువవుతోందని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఎంతకైనా మంచిదని 400 బడ్జెట్ గల సినిమాకు 450కోట్లు రెడీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మరో 50పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా రాజమౌళి మాత్రం సినిమా మేకింగ్ విషయంలో మాత్రం వెనెక్కి తగ్గేలా లేడని అనిపిస్తోంది. మరి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియాలి అంటే రాజమౌళి హామీ ఇచ్చే వరకు నమ్మలేము.