రాజమౌళి - శ్రీదేవి వివాదం.. ‘బాహుబలి’ సమయంలో ఏం జరిగిందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29గా ఆ చిత్రం వేగంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూల్స్ లకు సంబంధించిన షూటింగ్ ను జక్కన్న పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులోనే జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే ఎస్ఎస్ఎంబీ29 చిత్రం పట్టాలెక్కినప్పటి నుంచి రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఎస్ ఎస్ రాజమౌళి పేరు సోషల్ మీడియాలో ఎప్పుడు మార్మోగుతూనే ఉంటుంది. ఇకపోతే తాజా గా ఎస్ఎస్ రాజమౌళికి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి కి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్గా పేరు సొంతం కావడం, హాలీవుడ్ దర్శకులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందడం చూస్తూనే ఉన్నాం. అయితే రాజమౌళికి అంతటి ఘన కీర్తిని తెచ్చిపెట్టిన మొదటి చిత్రం బాహుబలి. 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత 2017లో బాహుబలి 2 వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే బాహుబలి 2 చిత్రం తర్వాత ఎస్ఎస్ రాజమౌళికి గొప్ప డైరెక్టర్ గా గుర్తింపు దక్కింది. సినిమాకు కూడా ఖ్యాతిని తెచ్చిపెట్టారు. అయితే బాహుబలి చిత్రంతో ఎస్ఎస్ రాజమౌళికి అతిలోక సుందరి, దివంగత శ్రీదేవికి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అప్పట్లో దీనిపై అటు ఎస్ఎస్ రాజమౌళి, ఇటు శ్రీదేవి కూడా స్పందించారు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఎస్ ఎస్ ఎన్ బి 29 సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో వారికి సంబంధించిన ఓల్డ్ వీడియోస్ దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.
కాగా ఎస్ఎస్ రాజమౌళికి శ్రీదేవికి బాహుబలి సినిమా సమయంలో చిన్నపాటి ఘర్షణ జరిగిందని ఆ వీడియోలో సారాంశం. ఇక ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ నటించిన రాజమాత శివగామి పాత్రకు శ్రీదేవిని అడిగారంట. కానీ శ్రీదేవి భారీ రెమ్యూనరేషన్ 8 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో పాటు, తన అకామిడేషన్ ను కాస్ట్లీ హోటల్స్ లో తీసుకోవాలని, బిజినెస్ క్లాస్ టికెట్స్ తనతో పాటు మరో నలుగురికి ఉండాలని కండిషన్స్ పెట్టారంట. దాంతో బడ్జెట్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉండడంతో రాజమౌళి శ్రీదేవిని పక్కన పెట్టేశారు.
అయితే ఆ విషయాన్ని ఎస్ఎస్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దాంతో శ్రీదేవి పై నెగిటివ్ ప్రచారం జరిగింది. ఈ విషయమై శ్రీదేవి తన నెక్స్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన మాటలను ఖండించింది. అంతేకాకుండా తను ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టే రకం కాదని, అలాగైతే తను చిత్ర పరిశ్రమలో 300కు పైగా సినిమాలు చేసే దానిని కాదని గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక రాజమౌళి శ్రీదేవి గురించి అలా చెప్పడంతో కాస్త వివాదంగా మారిందని అంటున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో యాక్షన్ అడ్వెంచర్స్ ఫిల్మ్ ను రూపొందిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండు నిమిషాల గ్లిమ్స్ విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నారని కూడా అంటున్నారు. దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











