ఆకాశవాణి కోసం రాజమౌళి.. అదిరిపోయే అప్డేట్!
ఆకాశవాణి సినిమా రిలీజ్ కంటే ముందుగానే మంచి హైప్‌ను ఏర్పర్చుకుంది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమాకు పనిచేయడం,మధ్యలో ప్రాజెక్ట్‌ను వదిలేయడం వంటి వాటితో ఆకాశవాటి పేరు సోషల్ మీడియాలో బాగానే మార్మోగిపోయింది. అంతే కాకుండా ఆ మధ్య వదిలిన గ్లింప్స్, మోషన్ పోస్టర్ కూడా బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఆకాశవాటి యూనిట్ అదిరిపోయే అప్డేట్‌ను ప్రకటించింది.
రాజమౌళి వద్ద సహాయకుడిగా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరుకెక్కుతున్న సరికొత్త చిత్రం 'ఆకాశవాణి'. ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. సినిమా టీజర్‌ను దర్శకుడు రాజమౌళి మార్చి 5, సాయంత్రం 4:35 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మొత్తంగా జక్కన్న దించి సినిమాపై హైప్‌ను పెంచేశారు.

పద్మనాభరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండగా బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ఓ పల్లెటూరి పిల్లవాడు ఉత్సాహంగా రేడియోను చూస్తున్న దృశ్యం వైవిధ్యంగా ఆకట్టుకునేలా ఉంది. చిత్రానికి సురేష్ రగుతు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మొత్తానికి రేపు ఆకాశవాటి టీజర్ రచ్చ చేసేలానే ఉంది.


Click it and Unblock the Notifications











