For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చంద్రబాబు గురించి రాజమౌళి బ్రదర్ పరోక్ష ట్వీట్.. అలా ఎవరైనా కోరుకుంటున్నారా?

  |

  ఎవరబ్బా ఈ రాజమౌళి బ్రదర్ అనుకుంటున్నారా ? ఆయన మీకు బాగా పరిచయస్తుడేనండీ. రాజమౌళి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి, చేసింది చిన్న పాత్రలే అయినా గుర్తుండి పోయే పాత్రలు చేసిన ఆయన పేరు ఎస్ఎస్ కంచి. తాజాగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  చంద్రబాబు-వ్యవసాయం

  చంద్రబాబు-వ్యవసాయం

  కేవలం నటుడిగానే కాకుండా ఆయన రచయితగా కూడా కంచి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కొన్ని సినిమాలకు ఆయన స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. అయితే ఇవేవీ ఆయనకు పేరు తీసుకు రాలేదు. కానీ రాజమౌళి సినిమాల్లో చేసిన చిన్న చిన్న పాత్రలే ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ సంగతి పక్కన పెడితే ఒకానొక సమయంలో చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అని కామెంట్ చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున చంద్రబాబుకు, తెలుగుదేశానికి ప్రతిపక్షంగా ఉండే కాంగ్రెస్ ప్రచారం చేసింది.. అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు. కానీ చంద్రబాబు మద్దతుదారులు మాత్రం ఆయన ఆ మాట అనలేదు అని అంటారు.

  వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నారా?

  వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నారా?

  అయితే చంద్రబాబు నాయుడు మి వ్యతిరేకించేవారు మాత్రం ఆయన అలాంటి కామెంట్ చేశారు అని అంటూ ఉంటారు. అయితే ఆ నిజానిజాలు నిర్ధారణ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎస్.ఎస్.కాంచి తన ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, ''సరే... దండగ అన్నాడు... (అనుకుందాం) ఇంతకీ ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు పిల్లల్ని నువ్వు ఆరు నూరైనా రైతువి అయ్యి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నారా? (వారసత్వ రైతు కుటుంబాల్లో నైనా) Don't quote me weekend farmers please'' అంటూ కామెంట్ చేశారు. అయితే ఇందులో ఆయన చంద్రబాబు నాయుడు పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా వ్యవసాయం దండగ అనే మాట గుర్తు వస్తే కచ్చితంగా గుర్తొచ్చేది చంద్రబాబు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన కావాలనే ఈ కామెంట్ చేశారని అంటున్నారు.

  రంగంలోకి బాబు మద్దతుదారులు

  రంగంలోకి బాబు మద్దతుదారులు

  అయితే ఇక్కడ ఆయన చంద్రబాబును సపోర్ట్ చేయడం మాట పక్కన పెడితే చంద్రబాబు మాట్లాడిన మాటలు ఏమైనా తప్పు ఉందా అని కొందరు చంద్రబాబు మద్దతు దారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అన్నట్లుగానే ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వారైనా సరే వ్యవసాయం చేయడం దండగ అని వారి పిల్లలను పెద్ద చదువులు చదివించాలని ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు కొంతలోకొంత ఉద్యోగాలు చేసి విసిగి వేసారిన వారు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకొని వ్యవసాయం బాట పడుతున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం తమ తమ పిల్లలను వ్యవసాయం చేయించాలనే ఉద్దేశంతో ఏ మాత్రం లేరు. ఇక ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించి మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది.

  ఆసక్తికరంగా మారిన ట్వీట్

  ఆసక్తికరంగా మారిన ట్వీట్

  ఇదే విషయాన్ని కంచి కూడా తన ట్విట్టర్ లో పేర్కొన్నారు..అయితే రాజమౌళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని గతంలో కూడా టీడీపీ వ్యతిరేక పార్టీలు టార్గెట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే అమరావతి లో కొన్ని డిజైన్ల విషయంలో రాజమౌళి సలహాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకోవడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. సో రాజమౌళి ఎలాగూ చంద్రబాబు నాయుడు సపోర్టర్ కాబట్టి ఆయన సోదరుడు కూడా ఇలా మాట్లాడి ఉండవచ్చని వ్యతిరేక వర్గం వారు కామెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ట్వీట్ మాత్రం ఆసక్తికరంగా మారింది అని మాత్రం చెప్పక తప్పదు. మరి చూడాలి ఏమి జరగబోతోంది అనేది.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక కంచి చేసిన సినిమాల విషయానికి వస్తే ఆయన దర్శకుడిగా రెండు సినిమాలు చేయగా అందులో ఒక సినిమా ఇప్పటికే రిలీజ్ అయింది. మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని తెలుస్తోంది. అందులో పెహ్లూ అనే ఒక బై లింగ్యువల్ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా షో టైం అనే సినిమా రిలీజ్ అయ్యి పెద్దగా ఆడకుండానే వెళ్లిపోయింది కూడా.

  పెహ్లూ సినిమా మీద ఆయన చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు అని చెప్పక తప్పదు. ఇక ఆయన నటుడిగా చేసిన సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సింహాద్రి, తొలిచూపులోనే, వెంకీ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, ఛత్రపతి, మర్యాదరామన్న, ఏమో గుర్రం ఎగరా వచ్చు, విజేత, డియర్ కామ్రేడ్, ఏదైనా జరగొచ్చు, మత్తు వదలరా లాంటి సినిమాల్లో ఆయన నటించిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అన్నట్టు అమృతం సీరియల్ లో కూడా ఆయన అంబుజ లింగం అనే ఒక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక రైటర్ గా కూడా ఆయన ఒక తమిళ సినిమాకి అలాగే ఏమో గుర్రం ఎగరావచ్చు, మర్యాద రామన్న, అమృతం సీరియల్ కి కథ విషయంలో కూడా పని చేశారు.

  English summary
  Rajamouli Brother's tweet indirectly referring to remarks made by former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has now gone viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X