Varanasi: వారణాసి హీరోయిన్‌తో రాజమౌళి స్టెప్పులు.. పార్టీ వీడియో లీక్ ..
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన దర్శకుల్లో ఆయన ఒకరు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి చిత్రాలతో రాజమౌళి మేకింగ్ స్టైల్, విజన్, కథన శైలి అంతర్జాతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. హాలీవుడ్ దర్శకులు సైతం ఆయన పనితీరుకు, కథను ఆవిష్కరించే తీరుకు ఫిదా కావడం అందరికీ తెలిసిన విషయమే. భారీ స్కేల్ అయినా, ఎమోషన్ అయినా, యాక్షన్ అయినా... ప్రతి అంశాన్ని పర్ఫెక్ట్‌గా మలచడంలో జక్కన్నకు సాటి లేరనే చెప్పాలి. అలాంటి లెజెండ్ డైరెక్టర్.. 'వారణాసి' హీరోయిన్ తో కలిసి ఆయన వేసిన స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతూ, ఆపై హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటిన గ్లోబల్ ఐకాన్ 'ప్రియాంక చోప్రా'. ఈ అమ్మడు బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ 'వారణాసి'తో మళ్లీ ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్వాంటికో, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్‌లతో యాక్షన్ క్వీన్ ఇమేజ్‌ను సంపాదించిన ప్రియాంక చోప్రా, ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ స్పష్టం చేసింది. ట్రెడిషనల్ శారీ లుక్‌లో గన్ను పట్టుకుని కనిపించిన ఆమె పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి'పై ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. టైటిల్ లాంచ్, మహేష్ లుక్ రివీల్, ప్రియాంక ఫస్ట్ లుక్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా 'మందాకిని'అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
కథలో ఆమె పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, యాక్షన్‌తో పాటు కథను ముందుకు నడిపించే పవర్ ఫుల్ షేడ్‌లో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 'వారణాసి' టీమ్‌తో ప్రియాంక చోప్రా ఎంత బాగా కలిసిపోయిందో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చెబుతున్నాయి. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా న్యూఇయర్ సందర్భంగా రాజమౌళి-ప్రియాంక కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతోంది. ఓ ఇంగ్లిష్ సాంగ్‌కు జక్కన్న చాలా స్టైలిష్‌గా స్టెప్పులు వేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. డ్యాన్స్ ముగిసిన వెంటనే ప్రియాంక ఆనందంతో రాజమౌళిని కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు, నటనతో పాటు మంచి డ్యాన్సర్ కూడా, 'జక్కన్న టేకింగ్ మాత్రమే కాదు.. డ్యాన్స్ కూడా అదిరిపోయింది', 'డైరెక్టర్ కాదు.. ఫుల్ ఎంటర్టైనర్', 'వారణాసి టీమ్ వైబ్ నెక్స్ట్ లెవల్' అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. గతంలో కుటుంబ వేడుకల్లో ఆయన వేసిన స్టెప్పులు వైరల్ కాగా, ఇప్పుడు ప్రియాంకతో కలిసి చేసిన ఈ డ్యాన్స్ మరోసారి ఆయన ఎనర్జీని చూపించింది.
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... న్యూఇయర్ 2026 సెలబ్రేషన్స్ కోసం ప్రియాంక చోప్రా ఇప్పటికే అమెరికాలో ఉంది. అక్కడ నిక్ జోనాస్, జోనాస్ బ్రదర్స్‌తో కలిసి కాన్సర్ట్‌లో సందడి చేసింది. డిసెంబర్ 31 మిడ్‌నైట్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే అదే సమయంలో రాజమౌళితో కలిసి డ్యాన్స్ వీడియో ఎలా సాధ్యమయ్యింది? అన్న ప్రశ్న నెటిజన్లలో మొదలైంది. 'వారణాసి' టీమ్‌తో అడ్వాన్స్‌గా న్యూఇయర్ పార్టీ జరిపి, ఆ తర్వాత అమెరికాకు వెళ్లి జోనాస్ బ్రదర్స్ సెలబ్రేషన్స్‌లో పాల్గొని ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు బాలీవుడ్‌కే పరిమితమైన ప్రియాంక, ఇప్పుడు హాలీవుడ్ వరకు తన మార్కెట్‌ను విస్తరించింది. అలాంటి గ్లోబల్ స్టార్ 'వారణాసి'లో నటించడం ఈ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకురానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గ్లోబల్ ఆడియన్స్ దృష్టి ఈ సినిమాపై పడటంలో ప్రియాంక పాత్ర కీలకంగా మారనుంది. మొత్తానికి 'వారణాసి' కేవలం ఓ పాన్ ఇండియా సినిమా కాదు... పాన్ వరల్డ్ మూవీగా మారే లక్షణాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. రాజమౌళి-మహేష్ బాబు-ప్రియాంక చోప్రా కాంబోకు తోడు, తాజాగా లీకైన పార్టీ వీడియో సినిమాపై బజ్‌ను మరింత పెంచింది. ఇక ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











