Rajamouli: ఏడాది కష్టాన్ని అలా లీక్ చేశారు.. రాజమౌళి ఎమోషనల్
Globe Trotter Event: మహేష్ బాబు, రాజమౌళి కాంబో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. "వారణాసి" అనే టైటిల్ తో మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ అనుకున్నట్లుగానే మహేష్ బాబు సినిమాకు 'వారణాసి' అని ఫిక్స్ చేశారు జక్కన్న. అయితే.. 'గ్లోబ్ ట్రాటర్'ఈవెంట్ వేదికగా వారణాసి సినిమా గురించి దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే.. రాజమౌళి మాటలు ఆ అంచనాలను మరో 10 రెట్లు పెంచేశాయి. ఇంతకీ ఏమన్నారంటే?
డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. ట్రైలర్ గురించి ఇంకా వెయిట్ కరెక్ట్ కాదు. ఈ విషయంలో అందరూ క్షమించండి. ట్రైలర్ డిస్ప్లే చేయడంలో విఫలం కావడం ఇంకా ఏం జరిగిందో మీకు వివరంగా చెప్తా. ట్రైలర్ ను ప్రపంచంలోనే అత్యంత గొప్పగా ప్రదర్శించాలని భావించాం. 100 X130 అడుగుల స్క్రీన్ ఏర్పాటు చేసాం. ఇండియాలో ఉన్న ఎల్ఈడి స్క్రీన్ తీసుకువచ్చాం. దానికి పవర్ అందించడానికి 45 జనరేటర్లను ఉపయోగించాం ’ అని తెలిపారు.

'ఈ ట్రైలర్ డిస్ప్లే కోసం చాలా ప్లానింగ్ చేశా, చాలామంది టెక్నీషియన్స్ కష్టపడ్డాం. ట్రైలర్ టెస్టింగ్ కోసం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ట్రై చేశాం. ట్రైలర్ లీక్ కావద్దని స్క్రీన్ చుట్టూ భారీ క్రేన్సును ఉపయోగించి, బ్లాక్ కలర్ క్లాత్ కూడా ఏర్పాటు చేసాం. ఎక్కడినుండి వచ్చాయో తెలియదు కొందరూ డ్రోన్ కెమెరాలతో మేము చేస్తున్న వాటిని రికార్డు చేశాయి. వాటిని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. మేము ఒక సంవత్సరం పాటు కష్టపడ్డ ఫలితాన్ని క్షణాలలో లీక్ చేశారు'అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.
తదుపరి.. వారణాసి సినిమా గురించి మాట్లాడుతూ రాజమౌళి మరో సంచలన వ్యాఖ్య చేశారు. "ఇప్పుడు వరకు ప్రతి సినిమాకూ ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పేవాడిని. కానీ ఈ సినిమాకు మాటలు సరిపోవు. ఈ కథను మాటల్లో చెప్పడం అసాధ్యం. ప్రేక్షకుల అంచనాలు సెట్ చేయడానికి మాత్రమే ఈ వీడియోను చేశాం" అని అసలు విషయాన్ని వెల్లడించారు. 'వాస్తవానికి ఈ ఈవెంట్ ను మార్చ్ నుంచే ప్లాన్ చేశాం. జూన్, జూలైలో పూర్తిచేశాం. కానీ, హైదరాబాద్ లో మొత్తం వర్షాలు. ఇలా నవంబర్ 15 వరకు వచ్చింది. ఫైనల్ గా చూపిస్తున్నాం' అని అన్నారు. ఈ మాటలతో వారణాసి మూవీ కాన్సెప్ట్ సాధారణ కథ కాదని స్పష్టమైంది.
అలాగే.. హీరో కృష్ణ గురించి కూడా రాజమౌళి మాట్లాడారు. "చిన్నప్పుడు కృష్ణగారి గొప్పతనం తెలియలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఆయన పునాది వేసిన టెక్నాలజీ రివల్యూషన్స్ అర్థమయ్యాయి. అలాంటి లెజెండ్ కొడుకు మహేశ్ బాబుతో ఇప్పడు సినిమా చేస్తున్నా.. కొత్తదనం, పెద్దపాటి విజన్ చూపించకుండా ఎలా?" అని చెప్పారు. ఈ నేపథ్యంలో వారణాసి మూవీని ప్రీమియం లార్జ్ స్కేల్ ఐమాక్స్ ఫుల్ స్క్రీన్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. బాహుబలి, RRR సినిమాలను 1.90:1 ఫార్మాట్‌లో షూట్ చేశామని, కానీ ఇది పూర్తిగా ఫుల్ స్క్రీన్ ఐమాక్స్ లో తెరకెక్కించబోతున్నామని తెలిపారు.
వారణాసి ట్రైలర్ ప్లే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తింది. ఈ తరుణంలో రాజమౌళి దేవుడు గురించి చేసిన మాటలు వైరల్ గా మారాయి. "నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం ఉండేది కాదు. నాన్నగారు హనుమంతుడు నడిపిస్తాడని అన్నప్పుడు కోపం కూడా వచ్చేది. కానీ ఈ సినిమా రాస్తున్నప్పుడు... కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ రాస్తుంటే నేను నేల మీద లేను. మహేశ్ బాబు రాముడిలా కనిపించాడు. గూస్ బంప్స్ వచ్చాయి" అని చెప్పారు. ఈ భావోద్వేగ వ్యాఖ్యలు విన్న ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ఆ తర్వాత మహేశ్ బాబు వ్యక్తిత్వం గురించి రాజమౌళి మాట్లాడుతూ.. "సినిమా, నటన గురించి కాదు... మహేశ్ నిజ జీవితంలో ఉన్న మనిషితనం గురించి మాట్లాడాలి. ఎంత పెద్ద స్టార్ అయినా సెల్‌ఫోన్‌కి బానిస కావడం లేదు. సెట్‌లో ఉన్నంతసేపు ఫోన్ తన చేతిలో ఉండదు. మన అందరం నేర్చుకోవలసిన గుణం అది. నీలా ఉండటానికి నేను కూడా ప్రయత్నిస్తా మహేశ్" అని అన్నారు.
మొత్తం మీద రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వారణాసి మూవీ కేవలం సినిమా కాదు... ఒక ఆధ్యాత్మిక, విజువల్, టెక్నికల్ అనుభవంగా ప్రజల ముందుంచబోతున్నారన్న సంకేతాలను స్పష్టంగా ఇస్తున్నాయి. 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ తో వారణాసి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరిగాయి.


Click it and Unblock the Notifications











