మహేష్ బాబుపై అలాంటి అనుమానం.. రాజమౌళి నమ్మకం అదే!
Varanasi: టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచ సినిమా ప్రేమికులంతా ఎదురు చూస్తున్న భారీ కాంబినేషన్ ఎస్.ఎస్. రాజమౌళి - మహేష్ బాబు. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న పాన్ వర్డల్ సినిమా 'వారణాసి'. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆశలు అంచనాలను మరింత పెంచుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నిర్వహించిన 'గ్లోబ్ ట్రోటర్' ఈవెంట్‌లో దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాల్ని బయటపెట్టారు. ముఖ్యంగా వారణాసి సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాత్ర గురించి వివరించారు. ఇంతకీ ఏమన్నారంటే?
నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం
వారణాసి ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. "నేను చాలా సార్లు చెప్పాను... నాకు మహాభారతం అన్న, రామాయణం అన్న అమితమైన ప్రేమ, చాలా ఇష్టం. మహాభారతం తీయడం నా డ్రీమ్.ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు తెలియదు. ఈ మూవీ కూడా రామాయణంలో కీలక ఘట్టం ఆధారంగా సినిమా తీస్తానని, కానీ ఒక్కొక్క సీన్ రాస్తుంటే.. ఒక్కొక్క షార్ట్ తీస్తుంటే.. ఏదో తెలియని ఫీలింగ్.. నేను నేల మీద నడవడం లేదు గాల్లో తేలుతున్నానా అనే ఫీలింగ్ వచ్చింది'అని రాజమౌళి పేర్కొన్నారు.

రాముడి గెటప్ లో మహేష్ బాబు
"తొలి రోజు మహేష్ బాబుతో రాముడి లుక్‌లో ఫొటోషూట్ చేశాం. ఆ క్షణం నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్నట్లు అనిపించింది. కానీ, నామీద నాకే ఎక్కడో చిన్న అనుమానం. మహేష్ బాబులో ఉన్న చిలిపితనం, కొంటెతనం వల్ల కృష్ణుడి పాత్రకు పర్ఫెక్ట్ అనిపిస్తాడు. కానీ రాముడి లాంటి ప్రశాంతం, గంభీరమైన పాత్రలో అతను ఎలా కనిపిస్తాడా? అన్న అనుమానం నాలో ఉండేది. కానీ ఆ గెటప్‌లో అతన్ని చూసిన తర్వాత ఆ డౌట్ పూర్తిగా పోయింది. ఆ ఫోటోను నా ఫోన్ వాల్‌పేపర్‌గా కూడా పెట్టుకున్నాను. కానీ ఎవరో చూసి లీక్ చేస్తారన్న భయంతో తీసేశాను" అని వివరించారు.
60 రోజుల షూటింగ్ లో ప్రతి రోజు ఒక సవాల్
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి రాజమౌళి మాట్లాడుతూ "ఇప్పటికే 60 రోజుల షూటింగ్ పూర్తి చేశాం. ప్రతి రోజు ఒక కొత్త ఛాలెంజ్. ప్రతిదాన్ని మేము కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తున్నాం. సాంకేతికంగా, విజువల్‌గా, కథనం పరంగా ప్రపంచం చూడని స్థాయిలో సినిమా తీర్చిదిద్దుతున్నాం. ఎదురైన ప్రతి అవరోధాన్ని దాటం.. ఒక షాట్ కోసం రోజులు ఆలోచిస్తున్నాం. చిన్న క్యాస్ట్ నుంచి మహేష్ వరకు ప్రతి ఫ్రేమ్‌లో మేము పర్ఫెక్షన్ కోసం వెతుకుతున్నాం. ఇదే మా పెద్ద తపస్సు" అని చెప్పారు. "షూటింగ్ సమయంలో జరిగిన ఒక సీన్... మహేష్ చేసిన పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఆ రోజు నాకు గుండెల్లో దబ్దబింది. అది నా కెరీర్‌లో ఒక మెమొరబుల్ మూమెంట్. ఇక మొత్తం సినిమా కూడా ప్రేక్షకులకు అదే స్థాయి అనుభూతి ఇస్తుందనే నమ్మకం ఉంది" అని రాజమౌళి పేర్కొన్నారు.
ప్రీమియం టెక్నాలజీ - గ్లోబల్ లెవల్ ప్రాజెక్ట్
ఈ సినిమా సాధారణ మాస్ లేదా యాక్షన్ సినిమా కాదని, భావపూర్వకంగా, పురాణీయతంగా, ప్రపంచ స్థాయి విజువల్ గ్రాండియర్ మేళవింపుతో రూపొందుతున్నసినిమా అని రాజమౌళి స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం చూస్తూ ఉండేలా అత్యంత అత్యాధునిక కెమెరాలు, సౌండ్ టెక్నాలజీ, CGI తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
రామాయణ స్ఫూర్తి, మహేష్ బాబు రాముడి లుక్, రాజమౌళి పెర్ఫెక్షన్ అనేమూడు అంశాల కలయికతో... ఇది కేవలం ఒక సినిమా కాదు, భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయే విజువల్ గ్రాఫ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబు రాముడి రూపంలో కనిపించే రోజు... ఇండియన్ సినిమా కొత్త పేజీ తిరగబోతుందేమో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











